సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో హీరోగా, సహాయ పాత్రలలో రాణిస్తున్నాడు. ఢీ అల్టిమేట్ డాన్స్ షోలో ఒక జట్టు నాయకుడిగా కూడా చేయడం జరిగింది. ఇక పోవే పోరా షోలో కూడా యాంకరింగ్ ద్వారా గుర్తింపు వచ్చింది.
సుడిగాలి సుధీర్ మొదట్లో రామోజీ ఫిలిం సిటీ లో మాంత్రికుడిగా పని చేశాడు. సినిమా అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. ఆర్థికంగా ఈయన కష్టాలు మాటలలో వర్ణించడం చాలా కష్టం. తరువాత మల్లెమాల వారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షోకు సెలెక్ట్ కావడంతో ఇతని దశ తిరిగింది. తన నటనతో గుర్తింపు పొందాడు.
ఇక 2017లో నేనోరకం సినిమా ద్వారా సినిమాలలో నటించడం ప్రారంభించాడు. తరువాత హీరోగా 2019లో సాఫ్ట్వేర్ సుధీర్ మంచి గుర్తింపు తెచ్చింది. ఇలా ఒక వైపు సినిమాలలో.. మరొకవైపు బుల్లితెరలో పలు షోలలో రాణిస్తున్న సుధీర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇక అసలు విషయం ఏమిటంటే సుడిగాలి సుధీర్ అనాధ పిల్లల కోసం ఒక అనాధాశ్రమాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి అయినట్లు తెలుస్తుంది. సుధీర్ కట్టిస్తున్న అనాధాశ్రమాన్ని తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సందర్శించి ఇది ఒక బృందావనం లాగా ఉందని అభినందించడం జరిగింది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సుడిగాలి సుధీర్ ను ప్రశంసించడం జరిగింది. ఈయన కూడా కొంత విరాళం అనాధాశ్రమానికి ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈయన కూడా త్వరలోనే ఆ అనాధాశ్రమాన్ని సందర్శిస్తారని సోషల్ మీడియాలో టాక్.
సుడిగాలి సుధీర్ అనాధాశ్రమాన్ని ఒక దేవాలయంగా భావించినట్లు తెలుస్తుంది. ఈయనకు సంబంధించిన బర్త్డే ఫంక్షన్స్, సినిమా ఫ్రీ రిలీజ్ లాంటి సంతోష కార్యక్రమాలను అనాధ ఆశ్రయంలో పిల్లలతో కలిసి జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఈయన నటించిన గాలోడు చిత్రం టీజర్ ను అనాధఆశ్రమంలో పిల్లల మధ్య నుంచే రిలీజ్ చేయడం జరిగింది.
ఇక కమీడియన్ గా రాణిస్తూ ఇంత గొప్ప మనసుతో అనాధ పిల్లలకు ఆశ్రయంగా నిలుస్తున్న సుడిగాలి సుధీర్ ను తెలుగు ఇండస్ట్రలోని ప్రముఖులు సైతం ప్రశంసించడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.