బిగ్ బాస్ షో నాకు ఇష్టం లేదంటూ బిగ్ బాంబ్ పేల్చిన నాగార్జున!

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా బుల్లితెరపై దూసుకుపోతుంది బిగ్‏బాస్. ఇప్పటివరకు తెలుగులో ఘనంగా అయిదు సీజన్లను పూర్తిచేసుకుంది. చివరి రెండు సీజన్ లలో హోస్ట్ గా నాగార్జున చేయడం జరిగింది. కొన్ని రోజుల ముందు బిగ్ బాస్ సీజన్ 6 కూడా మొదలయ్యింది. అందులో కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

టీవీలో ‘బిగ్ బాస్’ సృష్టించిన, సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు… జస్ట్ తెలుగు టీవీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ రియాలిటీ షో సక్సెస్ సాధించింది. స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇప్పుడు తెలుగులో ‘బిగ్ బాస్’ సీజన్ 6 నడుస్తోంది.

గతంలో కింగ్ నాగార్జున రీసెంట్ గా ‘ది ఘోస్ట్’ అనే సినిమాను విడుదల చేశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా కింగ్ అక్కినేని నాగార్జున తెలుగు మీడియాతో గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అక్కడ అతనికి బిగ్ బాస్ షో గురించి ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా నాగార్జున స్పందించాడు. ఆయనకు బిగ్ బాస్ షో అంటే అంతగా ఇష్టం ఉండదని తెలియజేశారు. నాగార్జునకు ఎక్కువగా కామెడీ షో లంటే ఇష్టమని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తరువాత నిద్ర అంటే ఇష్టమని చెప్పడం జరిగింది.

ఇక ‘ది ఘోస్ట్’ సినిమా విషయానికి వస్తే.. చాలా కొత్తగా ఉంటుందని, ఎప్పటి నుంచో యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నట్టు గరుడవేగ సినిమా చూసిన తర్వాత అటువంటి సినిమా చేస్తే బావుంటుందని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారును పిలిపించి మాట్లాడానని వివరించారు.’శివ’ సినిమాకు ఎంత పేరు వచ్చిందో, ఈ సినిమాకు కూడా అంత పేరు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమా విజయ దశమి కానుకగా థియేటర్లలో విడుదల అయ్యింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీనితో నాగార్జున డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున ఒకటి రెండు సినిమా షూటింగ్ లను చేస్తున్నాడని తెలిసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాగార్జున మాత్రం బిగ్ బాస్ షో తో బిజీగా ఉంటున్నాడు.