కోదండరామిరెడ్డి – బాలకృష్ణ కాంబినేషన్ లో హిట్లు.. ఫ్లాపులు.. అందుకున్న సినిమాలు ఇవే!

నందమూరి బాలకృష్ణ తెలుగు అగ్ర సినీ నటుడుగా పరిచయం అక్కర్లేని పేరు. స్వర్గీయ ఎన్. టి. రామారావు కుమారుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన రాజకీయాల్లో కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా రాణిస్తూ వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించడం జరిగింది.

1974లో తాతమ్మ కల సినిమా ద్వారా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీనే ఏలెంత స్థాయిలో రాణించారు. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడు గా గుర్తింపు పొందారు. ఇక అసలు విషయం ఏంటంటే ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ దాదాపుగా 13 చిత్రాలలో నటించడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విశేషాలు ఏంటో చూద్దాం.

అనసూయమ్మ గారి అల్లుడు: 1986 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

భార్గవ రాముడు: 1987 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడి సానుకూల ఫలితాలు ఇచ్చింది.

భానుమతి గారి మొగుడు: 1987 లో విడుదలైన ఈ చిత్రం నైజాంలో సానుకూల ఫలితాలను ఇచ్చి.. మిగతా ప్రాంతాలలో ఫ్లాప్ గా నిలిచింది.

తిరగబడ్డ తెలుగు బిడ్డ: 1988 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయం సొంతం చేసుకుంది.

రక్తాభిషేకం: 1988 లో విడుదలైన ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది.

భలే దొంగ: 1989 లో విడుదలైన ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది.

నారి నారి నడుమ మురారి: 1990 లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ధర్మక్షేత్రం: 1992 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

నిప్పు రవ్వ: 1993 లో విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

బొబ్బిలి సింహం: 1994 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

మాతో పెట్టుకోకు: 1995 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

ముద్దుల మొగుడు: 1997 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన కలెక్షన్ల పరంగా సానుకూల ఫలితాలను ఇచ్చింది.

యువరత్న రాణా:1998 లో విడుదలైన ఈ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద సానుకూల ఫలితాలను ఇచ్చింది.

ఇక 2022లో అఖండ సినిమా విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాలలో కొనసాగుతూ.. సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.