హీరో రాజశేఖర్ తో సినిమాలు తీయడం కంటే అడుక్కోవడం బెటర్.. వైరల్ అవుతున్న నిర్మాతల మాటలు!

రాజశేఖర్ ఒక భారతీయ నటుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగులో తన రచనలతో బాగా ప్రసిద్ధి చెందాడు. 38 సంవత్సరాల కు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ 80 కి పైగా చిత్రాలలో నటించాడు. రాజశేఖర్ తమిళంలో పుదువై పెన్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

విజయకాంత్ తో కలిసి పూతియా తీర్పులో ఒక క్యారెక్టర్ రోల్ లో నటించాడు. ఇక 1985లో వందేమాతరం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇక వరుస అవకాశాలతో తనదైన శైలిలో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఈయన నటించిన కుటుంబ కథ చిత్రాలు దాదాపుగా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఈయన ఉత్తమ నటుడిగా రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఉత్తమ ప్రతి నాయకుడిగా ఒక ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈయన నటించిన చిత్రాలలో చెప్పుకోదగ్గ చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ఈయన గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాజశేఖర్ వ్యక్తిగతంగా మంచివాడే కానీ షూటింగ్ లకు లేటుగా వచ్చి తొందరగా వెళ్ళిపోతారట. ఎక్కువ గా టైం షెడ్యూల్ ను ఫాలో అవ్వడట. ఇందుకు దర్శక నిర్మాతలు నానా అవస్థలు పడేవారట. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆయన దగ్గర సన్నిహితులు రాజశేఖర్ పైల్స్ సమస్యతో బాధపడుతున్నాడని అందుకే అలా ప్రవర్తిస్తున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

రాజశేఖర్ కు సన్నిహితంగా ఉండే వాళ్లు మాత్రమే ఆయనతో సినిమా చేయగలుగుతారని మిగతా వాళ్ళు ఆయన పరిస్థితిని అర్థం చేసుకోలేరు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈయనతో దాదాపు నాలుగు సినిమాలు నిర్మించి ఐదో సినిమాను నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.