తెలంగాణ శకుంతల జీవితంలో అది మరవలేని విషాదం.. పాపం!

తెలంగాణ శకుంతల అంటే సినిమా రంగంలో హాస్యనటి, ప్రతి నాయకురాలు, క్యారెక్టర్ నటిగా అందరికీ సుపరిచితమే. తన అసలు పేరు కడియాల శకుంతల. తన నటనతో శకుంతల తెలంగాణ యాస లో మాట్లాడడం ద్వారా ఆమెకు తెలంగాణ అనే పేరు ఇంటిపేరుగా మారింది . ఈమె 1951లో మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మిలిటరీ ఆఫీసర్.

శకుంతలకు ముగ్గురు అక్కలు, ఒక చెల్లెలు ఉంది. చిన్నప్పటి విద్యా భాషమంతా పూణేలోనే జరిగింది. కొంతకాలానికి ఉద్యోగరీత్యా తండ్రి హైదరాబాదుకు బదిలీ అయితే కుటుంబం అంతా హైదరాబాద్ వచ్చేసింది. శకుంతల గారిది ప్రేమ వివాహం, కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఈమెకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం.

1979లో మాభూమి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. శకుంతల 75 చిత్రాలకు పైగా నటించారు. ఈమె నటించిన కుక్క సినిమా ద్వారా ఉత్తమ నాటిగా నంది అవార్డు వచ్చింది. శకుంతల గారు తెలంగాణ యాసలో మాట్లాడడమే ఆమెకు టర్నింగ్ పాయింట్. శకుంతల గారు రెండుసార్లు యాక్సిడెంట్ కి గురయ్యారు. మొదటిసారి ప్రమాదం ఏమీ లేకపోయినా రెండవసారి ప్రమాదం జరిగినప్పుడు ఆమె రెండు కాళ్లు విరిగి డాక్టర్లు సర్జరీ చేయాలి అన్నారు. తరువాత నటించలేనేమో అని చాలా బాధపడ్డారు. ఆ దేవుడి దయ వల్ల సర్జరీ సక్సెస్ అయ్యింది.

తరువాత ఆమె నిలదీసుకుని మళ్లీ కొన్ని సినిమాలలో నటించడం జరిగింది. తెలంగాణ శకుంతల గారు కొంపల్లి లోని ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ అపార్ట్మెంటు ధర దాదాపు 45 నుండి 50 లక్షల వరకు ఉండవచ్చు.శకుంతల గారి మతం హిందూజం. ఈమెకు ఇష్టమైన సినిమాలు గంగోత్రి, ఒక్కడు.ఈమెకు ఇష్టమైన నటులు చిరంజీవి, కృష్ణ. ఇష్టమైన నటీమణులు రాధికా శరత్ కుమార్. ఇష్టమైన హాస్యనటులు ఎమ్మెస్. నారాయణ, కోవై సరళ. ఇష్టమైన ప్రదేశం బెంగుళూరు. ఇష్టమైన ఆహారం పాలక్ పన్నీరు,రోటి. తెలంగాణ శకుంతల గారి ఆస్తి 13 నుంచి 14 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.

తెలంగాణ శకుంతల గారు చివరి సినిమా పాండవులు పాండవులు తుమ్మెద. ఈమెకు 2014 జూన్ 14 రాత్రి మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె మరణం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విషాదాన్ని నింపింది.