వడివేలు భారతీయ సినిమా నటుడు, హాస్యనటుడు. 1960లో తమిళనాడులోని మధురై లో జన్మించాడు. మొదట ఈయన ఫోటోలు, పెయింటింగ్ షాప్ లలో పని చేసేవాడు. చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈయన భార్య ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది.ఆయనకు రాజ్ కిరణ్ చిత్ర సీమలోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు.
తెలుగులో బ్రహ్మానందం కు కమెడియన్ గా ఎంత గుర్తింపు ఉందో, వడివేలుకు తమిళనాడులో అంతే గుర్తింపు ఉందని చెప్పవచ్చు. దాదాపు 200 సినిమాలలో నటించాడు. ఈయన ప్రతి అగ్ర సినిమాతో తమిళంలో నటించడం జరిగింది. ఈయన నటించిన చంద్రముఖి సినిమా కోసం రజనీకాంత్ గారు ఈయన ఖాళీగా లేకపోవడంతో రెండు నెలలు షూటింగ్ వాయిదా వేశారు అంటే ఈయన క్రేజ్ ఎంతో మనకు అర్థమవుతుంది.
2011 ఎలక్షన్లకు ముందు సూపర్ స్టార్ విజయకాంత్ తో సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక డైలాగ్ చెప్పడానికి ససే మీరా అన్నాడు వడివేలు. డబ్బులు తీసుకున్నారు కదా చెప్పాల్సిందే అంటూ గొడవ చేశాడు నిర్మాత. డబ్బులు తీసుకుంటే నువ్వు ఏమి చెప్తే అది చేయాలా అన్నాడు. ఇంతకు ఆ డైలాగ్ ఏమిటంటే రాష్ట్రానికి కాబోయే సీఎం విజయకాంత్. రాష్ట్రానికి మంచి చేయబోయేది ఆయనే.
ఆయన వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పాలి. తాను చెప్పను అనడంతో విజయకాంత్ కు తనకు మధ్య కాస్త గొడవ జరిగి తన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టి షూటింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత 2011 ఎలక్షన్లలో విజయకాంత్ కు, జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ తనదైన శైలిలో పంచులు వేశాడు వడివేలు. ఎలక్షన్లలో జయలలిత గెలిచి తర్వాత తమిళనాడు నిర్మాతలతో వడివేలును సినిమాలలో తీసుకోకూడదని ఒకవేళ తీసుకుంటే అవి విడుదలకు నోచుకోవని గట్టిగా చెప్పారు.
ఇంకా ఆమె పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా చాలావరకు థియేటర్లో ఉండటం చేత ఆయనకు సినిమా అవకాశాలు రాలేదు. తరువాత విజయకాంత్ కు జయలలితకు మధ్య కూడా కాస్త వివాదం వచ్చిన ఈయన పెద్ద స్టార్ కావడంతో ఈయన సినిమాలను ఆపలేకపోయింది. తరువాత విజయ కాంత్ మళ్లీ వడివేలుకు సినిమా అవకాశం కల్పించాడు.