వివి వినాయక్ తెలుగు సినీ ప్రముఖ దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. ఇతనికి యాక్షన్ చిత్రాలను దర్శకత్వం వహించడం వెన్నతో పెట్టిన విద్య. చిన్నప్పుడు నుండి సినిమాలంటే చాలా ఆసక్తి. వీరి కుటుంబానికి ఒక సినిమా హాలు ఉంది. రిలీజ్ అయిన ప్రతి సినిమా మిస్ అవ్వకుండా చూసేవాడు.
1993 లో ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన అబ్బాయిగారు చిత్రానికి అసిస్టెంట్ గా తెలుగు తెరకు పరిచయమై కెరీర్ ప్రారంభించాడు. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేసిన తర్వాత 2002లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
దర్శకుడిగా మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. తరువాత 2003లో ఈయన దర్శకత్వం వహించి, నితిన్ నటించిన చిత్రం దిల్ మంచి విజయం సాధించింది. తరువాత 2003లోనే ఈయన దర్శకత్వం వహించిన చిరంజీవి నటించిన చిత్రం ఠాగూర్ మంచి విజయం సాధించింది.
దర్శకుడిగా చేసిన మొదటి మూడు సినిమాలు విజయం సాధించడంతో తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులలో ఒకడుగా గుర్తింపు పొందాడు. 2013లో అవయవదానాన్ని ప్రోత్సహించడం కోసం ఒక లఘు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇలా కెరీర్లో బిజీగా ముందుకు సాగుతున్న వివి వినాయక్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా అనే ప్రశ్న ఎదురయింది. అందుకు తన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు చాలా బాధ అనిపించిందని తెలిపాడు. ఇక కెరీర్ పరంగా బద్రీనాథ్ సినిమా కోసం దేశమంతా పలుచోట్ల తిరిగి షూటింగ్ చేసినట్లు పేర్కొనడం జరిగింది. బద్రీనాథ్ సినిమాలో బ్రహ్మానందం గారి ఒక కామెడీ సన్నివేశం తొలగించాలని అనుకున్నారట.
కానీ సినిమా లెంత్ సరిపోదు. సెకండ్ ఆఫ్ 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ సన్నివేశం తీసేస్తే తర్వాత ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఆ సన్నివేశాన్ని తీసేయకుండా అలాగే రిలీజ్ చేశామని తెలపడం జరిగింది. ఆ ఒక్క సన్నివేశం తీసేసి ఉంటే పరిణామాలు కాస్త డిఫరెంట్ గా ఉండేవని తెలపడం జరిగింది.
ఇతను చివరగా దర్శకత్వం వహించిన సినిమా ఇంటెలిజెంట్. ప్రస్తుతం ఒక రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.