హాస్య నటుడు సూరి మంచితనాన్ని ఓర్వలేకపోయినా హోటల్ యజమానులు!

సూరి తమిళ సినీ నటుడు. తమిళ చిత్రాలలో బాగా ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు. ఇతని అసలు పేరు రామలక్ష్మనన్ ముత్తుసామి.. సినిమాల ద్వారా సూరిగా పిలువబడుతున్నాడు. సినిమాలలో నటించాలి అనే ఆసక్తితో 1996లో మధురై నుంచి చెన్నై వచ్చాడు.

సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ సినిమా ప్రయత్నాలు కొనసాగించాడు. మొదట్లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. 1997లో ఖదలుక్కు మరియధై అనే సినిమాలో హీరో వెనుక డాన్స్ వేసే చిన్న పాత్రతో తమిళ ఇండస్ట్రీలో మొదటి అడుగు వేశాడు.

కొంతకాలం జూనియర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ.. మెల్లగా హాస్య పాత్రలలో నటించడం ప్రారంభించాడు. తన నటనకు గుర్తింపు రావడంతో తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటులలో ఒకడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. దాదాపుగా తమిళ అగ్ర హీరోల సినిమాలలో నటించాడు. తెలుగులో 2012లో వచ్చిన ఫ్రెండ్షిప్ బుక్ సినిమా ద్వారా తెలుగు తెరకు కూడా పరిచయం కావడం జరిగింది.

ఈయన నటించిన తమిళ సినిమాలు సింగం, రజిని వంటి సినిమాలు తెలుగులో డబ్ చేయడం జరిగింది. ఈయన తమిళంలోనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇక అసలు విషయానికి వస్తే తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

చాలాసార్లు ఆకలి బాధను చవిచూడడం ద్వారా, కెరీర్లో బాగా ఎదిగిన తర్వాత సామాన్యులకు సైతం కడుపునిండా భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అమన్ పేరుతో కొన్ని హోటల్స్ పలు ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ హోటల్ ద్వారా తన ముఖ్య ఉద్దేశం నాణ్యమైన భోజనాన్ని అతి తక్కువ ధరలకే సామాన్యులకు అందించడం.

ఇదంతా చూసి ఓర్వలేకపోయినా పలు హోటల్ యజమానులు తమ వ్యాపారం దెబ్బతింటుందని.. సూరి హోటల్స్ పై పిటిషన్ వేశారు. ఉన్నత అధికారులు పరిశీలించగా అమన్ హోటల్స్ లలో నాణ్యమైన ఆహారం.. అందుబాటులో ధర ఉన్న, జీఎస్టీ పరంగా లావాదేవీలు సక్రమంగా లేవని హోటల్ నిర్వాహకులకు నోటీస్ ఇవ్వడం జరిగింది.

దీనిపై తమిళ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ.. సూరి మంచితనాన్ని ఓర్వలేక ఇలా చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇక సూరి ప్రస్తుతం విరుమన్, విడుతలై అనే తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.