బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో అఖండ2!

బోయపాటి శ్రీను తెలుగు సినీ దర్శకుడుగా అందరికీ సుపరిచితమే. ఇతనికి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి. 1997లో ముత్యాల సుబ్బయ్య స్టూడియోలో దర్శక విభాగంలో పనిచేయడం ప్రారంభించాడు. 2005లో రవితేజ నటించిన భద్ర సినిమాకు దర్శకత్వం వహించి.. దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత 2007లో విక్టరీ వెంకటేష్ నటించిన తులసి సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం సింహ. ఈ చిత్రం 2010లో విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బోయపాటి శ్రీను తెలుగు ప్రముఖ దర్శకులలో ఒకడుగా గుర్తింపు పొందాడు.

తరువాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం లెజెండ్. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం ద్వారా ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకోవడం జరిగింది.ఆ తర్వాత ఇతను సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ వంటి చిత్రాలను రచించి, దర్శకత్వం వహించడం జరిగింది.

ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం అఖండ. 2021 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక బాలయ్యతో నాలుగవ సినిమా చేయడానికి అఖండ-2 సినిమా కథను రెడీ చేసుకున్నాడట దర్శకుడు బోయపాటి శ్రీను.

ఇటీవలే కాలంలో బాక్సాఫీస్ వద్ద సీక్వెల్ సినిమాల హవ నడుస్తుంది. కే జి ఎఫ్ సినిమా సీక్వెల్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. త్వరలో పుష్ప పార్ట్ 2, ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 సినిమాలు కూడా రాబోతున్నాయి. అని అందరికీ తెలిసిందే.

ఇక అఖండ సినిమాను నిర్మించిన రవీందర్ రెడ్డి అఖండ పార్టు 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిపై బోయపాటి శ్రీను అఖండను మించి పార్ట్ 2 ఉంటుందని చెప్పడం జరిగింది. థియేటర్లో ఫ్యాన్స్ కు పండగే పండగ. వేరే లెవల్లో ఈ సినిమా ఉంటుందని తెలపడం జరిగింది.

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్.బి.కె 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు బోయపాటి శ్రీను రాపో 20 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.