నిర్మాత అడ్డాలపై ఆ హీరో విషయంలో సీరియస్ అయినా దాసరి!

చంటి అడ్డాల తెలుగు చలనచిత్ర నిర్మాత. ఈయన ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ రైటర్ గా అపార అనుభవం ఉంది. అడవి రాముడు, అల్లరి రాముడు, మొగుడు వంటి చిత్రాలను నిర్మించడం జరిగింది. చంటి అడ్డాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అల్లరి నరేష్ నటించిన యముడికి మొగుడు చిత్రంపై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు చంటి యముడికి మొగుడు చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా దాసరి నారాయణరావు గారిని, నాయుడు గారిని ఆహ్వానించడం జరిగిందని పేర్కొన్నాడు.

ఆ సినిమా షూటింగ్ కు హాజరైన దాసరి నారాయణరావు అక్కడ ఉన్న సెట్ చూసి ఇది ముందే ఉందా లేదంటే షూటింగ్ కోసం ఇప్పుడు వేశారా అని అడిగాడంట. అందుకు తాను ఈ సినిమా షూటింగ్ కోసమే వేశామంటే బుద్ధుందా ఆ హీరో కోసం ఇంత బడ్జెట్ పెట్టి తీయడం అవసరమా అని పేర్కొనడం జరిగింది. అప్పుడు నాయుడు గారు తనతో డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను అమ్మాలి కాబట్టి వాళ్లకు నచ్చిన రేటుకే ఇవ్వాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

ఒకవేళ సినిమాని డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే లాభమైన, నష్టమైన భరించవచ్చు కానీ ఇలా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే సినిమాలపై ఎక్కువ బడ్జెట్ పెట్టి రిస్క్ చేయడం అంత మంచిది కాదని పేర్కొనడం జరిగింది. తాను కథకు తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలి కదా అనుకుని 12 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి చాలా వరకు నష్టపోయినట్లు తెలిపాడు. యముడికి మొగుడు సినిమా రిలీజ్ సమయంలో ఆల్రెడీ సంధ్య థియేటర్లో వేరే సినిమా రిలీజ్ కావడం తనకు పెద్ద మైనస్ పాయింట్ అని తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బు తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని తెలిపాడు.