గాడ్ ఫాదర్ సినిమాలో పీకేఆర్ పాత్రలో నటించిన నటుడు ఎవరో గుర్తున్నాడా?

megastar godfather

మోహన్ రాజా దర్శకత్వం వహించిన, చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి తండ్రిగా, పీకేఆర్ పాత్రలో నటించిన నటుడు సర్వదమన్ డి బెనర్జీ గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.

సర్వదమన్ డి బెనర్జీ బెంగాలీ నటుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతను హిందీ, తెలుగు భాషలలో కూడా నటించాడు. ఇతను పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందడం జరిగింది. ఇతను 1983లో ఆది శంకరాచార్య చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక రావడం జరిగింది.

మొదటి సినిమాతోనే గుర్తింపు పొంది, సినిమాలలో రాణిస్తూ బుల్లితెరలో కూడా వివిధ సీరియల్ లలో నటించడం జరిగింది. ఇతను సినిమాలలో స్వామి వివేకానంద, కృష్ణుడు, విష్ణు పాత్రల ద్వారా ప్రసిద్ధి చెందాడు.

ఈయన 1986లో సిరివెన్నెల చిత్రంలో అంధుడైన వేణువుగా నటించి విమర్శకుల నుండి ప్రశంసలు పొందడం జరిగింది. 1993లో టెలివిజన్లో ప్రసారమైన కృష్ణ సీరియల్లో కృష్ణుడి పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందడం జరిగింది.

ఆ తరువాత హిందీ, బెంగాలీ భాషలలో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు పొంది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి గుర్తింపు పొందడం జరిగింది.

ప్రస్తుతం సర్వదమన్ డి బెనర్జీ రిషికేశ్ లో ధ్యానం బోధిస్తున్నాడు. ఇంకా ఇతను ఉత్తరాఖండ్ లోని మురికివాడ పిల్లలకు ఉచిత విద్య, జీవన నైపుణాలు అందించే ఎన్జీవో కు మద్దతు ఇస్తూ పలు సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం జరుగుతుంది.