టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం కలిగిన లత శ్రీ ఎక్కువగానే తెలుగు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ప్రబలమైన నటిగానే కాకుండా, ఆమె తన సపోర్టింగ్ రోల్స్‌కు పేరుగాంచింది. లత 1990లో ‘ఇరుగిల్లు పొరుగిల్లు’ అనే డ్రామా సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సినిమాలో చిన్న పాత్రలో నటించినప్పటికీ, ఆమె నటన ఇతర దర్శకులను మెప్పించి, ఆమెకు త్వరలోనే ఛాన్స్ దక్కింది.
ఈమెకు అప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ చాలా ఈజీగానే వచ్చింది. విజయవాడలో లతా శ్రీ పదో తరగతి చదివే రోజుల్లో సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నూతన నటీనటులుకావాలని పేపర్‌లో వేసిన యాడ్ చూసి.. ఫొటోలు పంపింది. ఆ వెంటనే ఆ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ కావడం.. అప్పట్లో వరుస చిత్రాల్లో బిజీ అయ్యింది.
యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు లాంటి సంచలన చిత్రాలల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 70 కి పైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి 1999వ సంవత్సరం తరువాత తెరమరుగైంది. ఈమెను ఇండస్ట్రీలో చిట్టి చెల్లేలు అని పిలుచుకునేవారు. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్‌గానే కాకుండా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు చెల్లెలుగా చేసింది.
సినిమాల్లో యమధర్మరాజు అంటే ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ గుర్తుకు వస్తారు. గంభీరమైన స్వరంతో యముండా అంటూ అంటూ ఆయన పలుకుకి బెంబేలెత్తిపోయేవారు.. అలాంటి యమధర్మరాజుకి తన అంద చందాలను ఎరగా వేసి.. ‘అభివందనం యమరాజా..’ అంటూ ఆడిపాడి యమధర్మరాజుతో హిమ క్రీములు రుచి చూసేట్టు చేసిన నాటి నటి లత శ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తరువాత 2007వ సంవత్సరంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అత్తిలి సత్తిబాబు’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే లతా శ్రీ ప్రస్తుతం మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నడని మరి రెండో కొడుకు బీటెక్ చేస్తున్నాడని చెప్పుకుంటు వచ్చింది లతా శ్రీ.
హీరో నాగశౌర్యకి సొంత అత్తే లత శ్రీ. కాని తనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరని చెప్పడంతో పాటు ఎప్పుడూ కూడా తన మేనత్త లతా శ్రీ పేరును నాగశౌర్య కాని.. అతని తండ్రి కాని ప్రస్తావించకపోవడంతో లతా శ్రీ హర్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే తనకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉందని తనంటే ఇష్టంలేని వారి పేర్లు చెప్పుకుని బతకడం తనకు అవసరం లేదంటున్నారు లతా శ్రీ.
చాలామంది నా అన్నయ్య కాని, మేనల్లుడు నాగశౌర్యని కాని.. ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని అంటున్నారు.. కాని నాకు నా అన్నయ్య ఉండి లేడని చెప్పలేను. ఉన్నాడంటే ఉన్నాడనే అంటా.. వాళ్ల గురించి నేను ఇంతకన్నా చెప్పాలని అనుకోవడం లేదు’ అని అంటోంది లతా శ్రీ. అయితే నా పేరు చెప్పుకోవడానికి వాళ్లు ఇష్టపడరు.. అలాంటప్పుడు నా మేనల్లుడు నాగశౌర్య పేరుకాని.. నా అన్నయ్య పేరుకాని చెప్పుకోవాలని నేను అనుకోవడం లేదు.
కాని నా తోడపుట్టినోడు కాబట్టి నీతో పాటు ఎవరైనా ఉన్నారా అంటే మా అన్నయ్య ఉన్నాడని చెప్తున్నా.. వాళ్లు అది కూడా చెప్పుకోలేకపోతున్నారు’ అంటూ వాపోయింది లతా శ్రీ.
లతా శ్రీ చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరో..
లతా శ్రీ అప్పట్లో శ్రీహరి విలన్ గా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించారు. అప్పుడు ఆయన లతా శ్రీ చెంపపై కొట్టాడని వైరల్ గా మారింది. దానికి లతాశ్రీ వివరణ ఇస్తూ నేను షాట్ అయిపోయిన తరువాత తనకు తెలియకుండానే నీటి ప్రవాహం ఉన్న చోటికి వెళ్తున్నపుడు జారీ పడబోతున్నపూడు శ్రీ హరి గమనించి పరిగెత్తుకుని వచ్చి చెంప మీద కొట్టారు. అల చేయడం వల్ల నేను బ్రతికాను లేకపోతే నేను అందులో పడిపోయెదానిని అని వాస్తవాన్ని చెప్పారు.
అయితే ప్రస్తుతం లతా శ్రీ సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమెకు మూడు వేర్వేరు చోట్ల జిమ్ సెంటర్లు ఉన్నట్టు తెలిపారు. ఆమె వాటిని చూసుకుంటూ ఉన్నారని రీసెంట్ గా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది నిజమేనని లతాశ్రీ స్పష్టతను కూడా ఇచ్చారు.