బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి సంచలన కామెంట్స్ చేసిన దర్శకుడు రాజమౌళి.. ఇంతకూ ఎమన్నారంటే?

యస్. యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర ప్రముఖ దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప దర్శకుడు.

ఇతను కె. రాఘవేంద్ర రావు శిష్యుడిగా 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. వరుసగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకడుగా గుర్తింపు పొందాడు.

రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా పరాజయం కాలేదు. ఈయన కెరీర్లో మగధీర, ఈగ, చత్రపతి, విక్రమార్కుడు, బాహుబలి 1,2 , ఆర్. ఆర్. ఆర్ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే అన్ స్పాటబుల్ షో కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో కు ప్రముఖ హీరోలైన అల్లు అర్జున్, నాని, మహేష్ బాబు లాంటి ప్రముఖులతో పాటు రాజమౌళి కూడా పాల్గొనడం జరిగింది. ఈ షో విజయవంతంగా గుర్తింపు తెచ్చుకుంది. సీజన్ 2 గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది అందులో కూడా హోస్టుగా బాలకృష్ణ నే నిర్వహించబోతున్నారు.

దీనికి సంబంధించి టీజర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో రాజమౌళి ఆ షో లో పాల్గొనడం చాలా త్రిల్లింగ్ గా ఉందని చెప్పడం జరిగింది. బాలయ్య దెబ్బబడితే ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుంది అని, బాలయ్య చేసే హోస్టింగ్ తెగ నచ్చిందని పేర్కొనడం జరిగింది. బాలయ్య టీజర్ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినట్లు తెలపడం జరిగింది.

ఇక బాలకృష్ణ ఎన్. బి. కే 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్. ఆర్. ఆర్ చిత్రం విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమా కథను తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.