సమంతకు శ్రీ రెడ్డి జీవిత పాఠాలు నేర్పిందా.. అసలు విషయం ఏంటంటే?

తెలుగు చిత్రసీమలో అత్యంత వివాదాస్పద పేర్లలో ఒకరైన శ్రీరెడ్డి మరోసారి సమంత అక్కినేని నాగ చైతన్యలపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది . కాస్టింగ్ కౌచ్ వివాదం త‌ర్వాత శ్రీ రెడ్డి పేరు మారు మ్రోగిపోయింది. ఈమె కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు ప‌లువురు సెల‌బ్రిటీల‌పై కామెంట్స్ చేయ‌డం, హాట్ హాట్ షోల‌తో హీటెక్కించ‌డం వంటివి చేసింది.

అయితే శ్రీ రెడ్డి నీతులు బోధిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి పేరుంది కానీ ఈసారి సమంత, నాగ చైతన్య విడాకుల పుకార్లపై స్పందించింది. మరోవైపు గతేడాది సమంతపై శ్రీరెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేసింది. ఆమె పరిశ్రమలోని శక్తివంతమైన ప్రతిభావంతులైన నటీమణులను లక్ష్యంగా చేసుకుని వారి గురించి కామెంట్స్ చేసింది.

ఆ తర్వాత శ్రీరెడ్డి నటీమణులపై సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేసి దుమ్మెత్తిపోసింది. కాస్టింగ్ కౌచ్ గురించి సౌత్ ఇండస్ట్రీ నిర్మాతలతో పాటు దర్శకులపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి 2018వ సంవత్సరం వార్తల్లో నిలిచింది. నేచురల్ స్టార్ నాని, విశాల్, సుందర్ సి, రాఘవ లారెన్స్, కొరటాల శివ, విశాల్, అభిరామ్ దగ్గుబాటి తదితరులను శ్రీరెడ్డి టార్గెట్ చేసింది.

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ అయిన సమంత, నాగచైతన్య అక్కినేని దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయని, వారిద్దరూ విడిపోవడానికి నిశ్చయించుకొన్నారనే వార్తలు గతేడాది మీడియాలో గుప్పుమన్నా విషయం అందరికి తెలిసిందే. మరి కొంత కాలం తరువాత నాగచైతన్య అక్కినేని, సమంత నిజంగానే విడిపోయారు.

ఆ తరుణంలో నటి శ్రీరెడ్డి వారిద్దరి బ్రేకప్‌పై ఘాటుగా స్పందించింది. నాగచైతన్య, సమంత దంపతులకు సానుకూలమైన ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. సమంత, నాగచైతన్యను ట్యాగ్ చేస్తూ లవ్ స్టోరీ ట్రైలర్ గురించి ట్వీట్ కూడా చేయడం జరిగింది. సమంత, నాగచైతన్యపై రూమర్లు వద్దు సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య అక్కినేని బెస్ట్ కపుల్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా కూడా ఉంటారని తెలిపింది. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత శ్రీ రెడ్డి స‌మంత‌కు కొన్ని జీవిత పాఠాలు నేర్పిందట. మరి శ్రీ రెడ్డి సమంత గురించి చెప్పుకుంటూ సమంతపై ఆమెకు చాలా గౌరవం ఉన్నట్లు ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, అది కూడా ఫెయిల్ అయితే ఇంకోటి వస్తాయని సమంతను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అలా జరగడాన్ని ఆమె కోరుకోవడం లేదని చెప్పుకుంటూ వచ్చింది. నాగచైతన్య-సమంత వాళ్లిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలని వాళ్ల మీద విమర్శలు గుప్పించింది.

ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్, ఇగోలు ఉంటాయని కానీ కాస్త సర్దుకుంటేనే జీవితం అని ఆమె దానినే నమ్ముతుందంటు చెప్పింది. కాబట్టి ఆమె సమంతను సర్దుకుకోవాలని అలాగే సమంత మాత్రమే కాకుండా నాగచైతన్య అన్నయ్య కూడా సర్దుకోవాలని పేర్కొంది.

ప్రస్తుతం శ్రీరెడ్డి యూట్యూబ్ లో ఒక ఛానెల్ ను క్రియేట్ చేసుకుంది. అందులో ఆమెకు సంబందించిన ప్రతి వీడియోను షేర్ చేస్తూ ఉంది. ఆమె తను చేస్తున్నా వంట వీడియోలలో పాటు తన అందాల ఆరబోతను కూడా చూపిస్తూ కుర్రకారుకు మతిపోయెలా చేస్తుంది.