చిరంజీవి వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు.. కారణం ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర నటుడిగా అందరికీ సుపరిచితమే. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి తన నటనతో.. వరుస అవకాశాలతో నాలుగు దశాబ్దాల కాలంలో 150 కి పైగా చిత్రాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా కొనసాగుతూ రాణిస్తున్నాడు.

మరొకవైపు రాజకీయ ప్రవేశం చేసి రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి మరల సినిమాలలో రీఎంట్రీ ఇచ్చి సినిమాలలో రాణిస్తున్నాడు.

ఇదంతా అందరికీ తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ వదులుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఆ సినిమాల వివరాలు ఏంటో చూద్దాం.

మన్నెంలో మొనగాడు: ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ గారు మొదట చిరంజీవితో చేయాలనుకున్నారు. ఆ పాత్ర చిరంజీవి సెట్ అవ్వదని వదిలేయడంతో అర్జున్ చేతికి వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది.

ఆఖరి పోరాటం: ఈ చిత్రాన్ని అశ్విని దత్ మొదట చిరంజీవితో చేయాలి అనుకున్నారు. కానీ చిరంజీవి డేట్స్ కుదరకపోవడంతో నాగార్జున చేతికి వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది.

అసెంబ్లీ రౌడీ: దాన్ని చిరంజీవి రాజకీయ నేపథ్యం ఉందని.. మరొకవైపు తాను బిజీగా ఉన్నానని వదులుకోవడంతో మోహన్ బాబు చేతికి వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది.

నెంబర్ వన్: ఈ చిత్రం చిరంజీవి వదులుకోవడానికి కారణం ఇంచుమించు ఇలాంటి కథతోనే చిరంజీవి ఇంతకుముందే సినిమా చేయడం. తర్వాత ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ చేతిలో పడి సూపర్ హిట్ గా నిలిచింది.

సాగర వీరుడు సాగర కన్య: ఇంచుమించు ఇలాంటి కథతోనే కొన్ని సినిమాలు పరాజయం కావడంతో చిరంజీవి ఈ సినిమాను వదులుకున్నాడు. ఈ సినిమాను విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ హిట్ విజయం సొంతం చేసుకున్నాడు.

ఆంధ్రావాలా: చిరంజీవి కోసమే ఈ కథ తయారు చేశాడు పూరి జగన్నాథ్. స్క్రిప్టు బాలేదని చిరంజీవి రిజెక్ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పడి సినిమా పరాజయం అయింది.

చంద్రముఖి: బి ఎన్ ఆదిత్య ఈ సినిమాను చిరంజీవితో చేయాలనుకుని చాలా రోజులు వెయిట్ చేశారట. డేట్స్ కుదరకపోవడంతో చిరంజీవి ఈ సినిమాను వదులుకుంటే రజినీకాంత్ సినిమా చేస్తే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

టైగర్ నాగేశ్వరరావు: రవితేజ హీరోగా ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. మొదట ఈ సినిమా కథ చిరంజీవికి వస్తే ఆయన రిజెక్ట్ చేయడంతో రవితేజ నటిస్తున్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.