మెగాస్టార్ చిరంజీవి భారతీయ ప్రముఖ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన రాజకీయాలలో కూడా రాణించిన విషయం అందరికీ తెలిసిందే. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగి కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.
1978లో పునాదిరాళ్లు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ రెండవ చిత్రం ప్రాణం ఖరీదు ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనకు గుర్తింపు పొంది వరుస అవకాశాలతో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో నటించడం జరిగింది. మరొకవైపు రాజకీయ రంగంలో ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక అసలు విషయానికి వస్తే రవి రాజా పిన్ శెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా ఏడు చిత్రాలలో నటించడం జరిగింది. ఇందులో రెండు హిందీ సినిమాలు ఉండడం విశేషం. ఈయన దర్శకత్వంలోనే చిరంజీవి హిందీ సినిమాలలో ఎంట్రీ ఇచ్చారు.
ఈ దర్శకుడికి రీమేక్ సినిమాలు తెరకెక్కించడం వెన్నతో పెట్టిన విద్య. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం
జ్వాల: ఈ చిత్రం 1985లో విడుదల అయింది. కమర్షియల్ పరంగా సానుకూల ఫలితాలను ఇచ్చింది.
చక్రవర్తి: ఈ చిత్రం 1987లో విడుదల కావడం జరిగింది. సినిమా కూడా కమర్షియల్ పరంగా సానుకూల ఫలితాలను తెచ్చిపెట్టింది.
యముడికి మొగుడు: 1988 లో విడుదలైన ఈ చిత్రం. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రతిబంద్: చిరంజీవి హిందీలో నటించిన మొదటి చిత్రం.. రవిరాజా పెనిశెట్టి దర్శకత్వం వహించిన మొదటి హిందీ చిత్రం. 1990 లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్లో హిట్ గా నిలిచి కమర్షియల్ సక్సెస్ సాధించింది
రాజా విక్రమార్క: 1990 లో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.
ఆజ్ కా గూండారాజ్: గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రీమేక్ చేసి హిందీలో ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. 1992లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అబౌట్ యావరేజ్ ఫలితాలు తెచ్చింది.
ఎస్పీ పరశురాం: 1994లో విడుదలైన ఈ చిత్రం. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సానుకూల ఫలితాలను ఇచ్చింది.