ఆ వయసులోనే ప్రేమలో పడ్డ అల్లరి నరేష్.. మామూలోడు కాదుగా!

Allari-Naresh

అల్లరి నరేష్ తెలుగు చలనచిత్ర నటుడుగా అందరికీ సుపరిచితమే. ఇతను తెలుగు దర్శకనిర్మాత ఇ. వి. వి సత్యనారాయణ కుమారుడు అని అందరికీ తెలిసిందే. 2002లో రవిబాబు దర్శకత్వం వహించిన అల్లరి సినిమాలో నటించడం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

మొదటి సినిమానే కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ద్వారా తన పేరు ముందు అల్లరి చేర్చుకొని అల్లరి నరేష్ గా గుర్తింపు పొందాడు. ఇక వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు.

అల్లరి నరేష్ నటించిన చిత్రాలు దాదాపుగా విజయం సాధించడం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో హాస్య చిత్రాలలో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందిన నటుడు. 2008లో గమ్యం సినిమాలో నటించడం ద్వారా ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు.

అల్లరి నరేష్ తన అన్నయ్య ఆర్యన్ రాజేష్ తో కలిసి వారి నిర్మాణ సంస్థ ఇ. వి. వి కింద సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా రాణిస్తున్న అల్లరి నరేష్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తనని ఇంతవరకు ఎవరినైనా ప్రేమించారా అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు సమాధానంగా అల్లరి నరేష్ తన మొదటి క్రష్ ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది అని తెలిపారు. ఆ క్లాసులో ఒక మలయాళం అమ్మాయి ముందు బెంచ్ లో కూర్చుంటుంది తానేమో చివరన ఉన్న బెంచీలో కూర్చోవడం ద్వారా తరచూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయే వాడినని తెలిపారు.

ఆ అమ్మాయి క్లాసులో బాగా చదువుతుంది. కానీ తనకేమో చదువుపై అంతా ధ్యాస ఉండేది కాదని చెప్పడం జరిగింది. ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెబితే తర్వాత మాట్లాడదేమో అన్న భయంతో తాను మనసులో మాట ఎప్పుడూ ఆ అమ్మాయితో చెప్పలేదని తెలిపాడు.

అందరినీ బాగా పలకరించే మనస్తత్వం ఉన్నందున ఆ అమ్మాయిని ప్రేమించడం జరిగింది అని చెప్పాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ సభకు నమస్కారం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం అనే రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.