విజయ రంగరాజు తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషించాడు. ఈయన కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించడం జరిగింది. స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రసిద్ధి చెందాడు.
1994లో వచ్చిన భైరవద్వీపం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఇతని అసలు పేరు రాజ్ కుమార్. ఇండస్ట్రీలో ఈ పేరుతో చాలామంది ఉన్నారు. ఇక భైరవద్వీపం సినిమా విజయం సాధించడంతో, ఆ సినిమాలో రంగరావు పాత్రను పోషించినందుకు ఈయన పేరును విజయ రంగరాజు గా మార్చుకోవడం జరిగింది.
ఈయన కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రం యజ్ఞం. ఈ చిత్రం ద్వారానే మంచి గుర్తింపు పొందాడు. కానీ ఈయనకు అనుకున్న రీతిలో సినిమా అవకాశాలు రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్న విజయరంగరాజు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ద్వారా తనకు సినిమా అవకాశాలు రావడానికి రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ కారణమని తెలపడం జరిగింది.
ఇక మలయాళం లో హాస్యనటుడు బాబు రాజ్ ఒక సినిమాలో అవకాశం ఇవ్వడం వల్ల మలయాళం లో కూడా గుర్తింపు వచ్చిందని తెలపడం జరిగింది. ఇక ఈయన కుమార్తెలు కూడా సినీరంగం వైపు రావాలి అని తాను అనుకున్నట్లు చెబుతూ, సరిగా అవకాశాలు రాకపోతే కెరీర్ పై దాని ప్రభావం ఏవిధంగా ఉంటుందో అని కూతుర్లు ఉద్యోగాలలో సెటిల్ అయినట్లు తెలిపాడు.
ఇక ఈయనకు ప్రతినాయక పాత్రలే కాక హాస్య పాత్రలో నటించాలని కోరిక. కానీ తన ఫేస్ హాస్య పాత్రల కంటే ప్రతినాయక పాత్రలకే సూట్ అవుతుందని సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని, హాస్య పాత్రలు గనుక వస్తే తన నటనను కచ్చితంగా నిరూపించుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం ఈయన సినిమాలలో ఏ పాత్ర వచ్చిన కూడా నటించాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.