రాహుల్ రవీంద్రన్ తెలుగు సినీ నటుడు. ఇతను స్క్రీన్ రైటర్ ఇంకా తెలుగు, తమిళ సినిమాలలో ప్రసిద్ధి చెందాడు. 2006లో తమిళంలో వచ్చిన మద్రాసీ సినిమాలో సహాయ పాత్ర ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తర్వాత తమిళంలో రెండు సినిమాలు నటించిన తర్వాత 2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు రావడంతో తన నటనకు మంచి గుర్తింపు పొందాడు. రెండు, మూడు సినిమాలలో హీరోగా నటించి ఎక్కువగా సహాయ పాత్రలలో నటించడం జరిగింది. ఇలా అవకాశాలతో రెండు సినీ ఇండస్ట్రీలలో రాణిస్తున్న రాహుల్ గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూలో తనను హీరోగా నటించి సహాయ పాత్రలో కూడా రావడం పై తన అభిప్రాయం ఏంటని ప్రశ్నించడం జరిగింది. అందుకు రాహుల్ మాట్లాడుతూ తాను హీరో గానే చేయాలని అనుకోలేదు అని చెప్తూ.. మంచి సహాయ పాత్ర అవకాశం వస్తే తన నటనను నిరూపించుకుంటాను కానీ మరే ఇతర కారణం లేదని చెప్పడం జరిగింది.
ఇక రెండవ ప్రశ్నగా సింగర్ చిన్మయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు తాను అవునని సమాధానం చెబుతూ గతంలో తాను చదువుకునే రోజుల్లో తన క్లాస్మేట్ ను ప్రేమించి రెండు సంవత్సరాల తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం జరిగిందని తెలిపాడు. ఆ సమయంలో ప్రేమ వేరు, ఆకర్షణ వేరు అని స్పష్టంగా తనకు అర్థమైందని తెలిపాడు.
అప్పుడే ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాడని తెలిపాడు. తరువాత సినిమాలలోకి వచ్చిన తర్వాత సింగర్ చిన్మయి పరిచయం అయిందని.. కొన్ని రోజులకు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చడంతో ప్రేమించి వివాహం చేసుకున్నానని తెలిపాడు. జీవితం అంటే పూర్తిగా సర్దుకుపోకూడదు.
మనకంటూ కొన్ని ఫీలింగ్స్, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకునే జీవితాన్ని ముందుకు నడిపించాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక 2002లో సీతారామం సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కు రీమేక్ గా తమిళంలో వస్తున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.