భాను చందర్ ఒక భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగు, తమిళ సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. ఇతను ప్రముఖ సంగీత స్వరకర్త మాస్టర్ వేణు కుమారుడు. 1978లో మన ఊరి పాండవులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
1980లో మూడు పని అని తమిళ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుస అవకాశాలతో తన నటనకు మంచి గుర్తింపు పొందాడు. 1991 లో తమిళంలో బుల్లితెరపై ప్రసారమయ్యే పెన్ సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా నటించడం ప్రారంభించాడు. తరువాత తమిళంలో వరుసగా పలు సీరియల్లలో నటించాడు.
1990లో నటించిన సూత్రధారులు చిత్రం. జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తరువాత ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు భానుచందర్. ఈయన కరాటే లో బ్లాక్ బెల్ట్. ఇలా వరుస అవకాశాలతో బిజీగా లైఫ్ గడుపుతున్న భానుచందర్ ఒక ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్ అలవాటు ఉందా అనే ప్రశ్న ఎదురైంది. అందుకు తాను ముంబైలో ఉన్నప్పుడు అనుకోకుండా డ్రగ్స్ అలవాటయింది.
ఆ సమయంలో తన తల్లి రెండు మూడు సార్లు తనను చూసి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపాడు. తరువాత తన అన్న సలహాతో మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి మలచుకొని తను మాస్టర్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందాడని తెలిపాడు. ఏదైనా చెడు వ్యసనం కావడానికి తక్కువ సమయం పడుతుంది. అదే ఆ అలవాటును మార్చుకోవాలంటే చాలా కష్టం అని పేర్కొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, ప్రభుత్వం కూడా పాఠశాలలలో మార్షల్ ఆర్ట్ ను పిల్లలకు నేర్పించడం ద్వారా చిన్నప్పటినుండే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి ఏ సమస్య అయినా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ముందుకు వెళతారని పేర్కొనడం జరిగింది.
ఏ వయసులో అయినా ఇది నేర్చుకోవచ్చు దీనివల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు అని ఆ ఇంటర్వ్యూ ద్వారా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం 2022 సంవత్సరంలో తెలుగులో కిన్నెరసామి, హిట్ చిత్రాలలో నటించడం జరిగింది. ఇక తమిళంలో ఓ మై గాడ్ అనే సినిమాలో నటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.