మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న బన్నీ.!

‘పుష్ప’తో ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’లో ఊర నాటు రోల్‌ పోషించి ట్రెండ్ సృష్టించాడు బన్నీ. అయితే, ట్రెండ్ మారింది. ‘పుష్ప 2’ కోసం బన్నీ షాకింగ్ అవతార్‌లో కనిపించబోతున్నాడట.

చాలా స్టైలిష్‌గా వుండబోతోందట ఆ లుక్. అందుకోసం ఓ ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్‌ని ఎంగేజ్ చేశారట. ఆయన నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. సినిమాలోని ఒక ఫ్రేమ్‌లో ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ వుండబోతోందట.

ఆ షాట్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడట బన్నీ. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ అస్పెట్ అవుతుందని అంటున్నారు.

పరమ ఊర నాటు గెటప్‌లో వుండే ‘పుష్పరాజ్’‌ని స్టైలిష్ యాక్షన్ గెటప్‌లో సుక్కు ఎలా చూపించబోతున్నాడా.? అని ఇప్పటి నుంచే బన్నీ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ షాట్ సినిమాలో ఎక్కడ ప్లేస్ చేయబోతున్నాడో సుక్కు తెలియాలంటే ఇంకా చాలా టైమే వెయిట్ చేయాల్సి వస్తుంది.