Yuganiki Okkadu Director : “పుష్ప” సినిమాపై “యుగానికి ఒక్కడు” దర్శకుడి ఊహించని స్పందన వైరల్.!

Yuganiki Okkadu Director : గత ఏడాది టాలీవుడ్ సహా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో “పుష్ప పార్ట్ 1” కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీసిన ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయిగా రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల కెరీర్ లోనే ఒక బెస్ట్ సినిమాగా పుష్ప విపరీతమైన ఆదరణ అందుకుంది. మరి నిన్ననే మన దక్షిణాది భాషల్లో ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ కాగా మళ్ళీ అదే స్థాయిలో రెస్పాన్స్ ని ఇంకా ఈ సినిమా చూడని వారి నుంచి అందుకుంటుంది.

అయితే తమిళ్ లో పుష్ప తరహా చాలా సహజమైన సినిమాలు “7 జి బృందావన కాలనీ”, “యుగానికి ఒక్కడు” లాంటి ఆసక్తికర తీసే దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమా చూసాక ఊహించని రేంజ్ రెస్పాన్స్ ని అందించారు. సుకుమార్ వర్క్ ఈ సినిమాకి చాలా ప్రతిష్టాత్మకంగా ఉందని సినిమాలో ప్రతి పాత్ర కూడా అద్భుతమైన నటనను కనబరిచారు.

ఇక దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ మరియు నేపథ్య సంగీతానికి అడిక్ట్ అయ్యిపోయానని ఫైనల్ గా అల్లు అర్జున్ నటన అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని అతడి బాడీ లాంగ్వేజ్ సినిమాలో చాలా బాగుంది అని కొనియాడారు. సెల్వ సినిమాల్లో నటీనటుల నుంచి ఎలాంటి పెర్ఫామెన్స్ ని చూపిస్తారో అందరికీ తెలుసు. అలాంటిది ఈ దర్శకునిని బన్నీ మెప్పించాడు అంటే విశేషమే అని చెప్పాలి.