Bhumana: మీరు భయపెడితే భయపడేది లేదు….. పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చిన భూమన?

Bhumana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైకాపా మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కార్పోరేటర్లు ఉన్న నివాసాల పై జనసేన సైనికులు దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురిచేసారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. అర్ధరాత్రి కాడ మహిళలని కూడా చూడకుండా వారి ఇంటి తలుపులు తడుతూ వైసిపి కి ఓట్లు వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవల వస్తుంది అంటూ వారిని ఇబ్బందులకు గురి చేశారు.

వైసీపీకి ఓటు వేస్తే మీ అంతు చూస్తామని అసభ్యపద జాలంతో మాట్లాడుతూ.. బెదిరించారని అన్నారు. చిత్తూరు నుంచి ఈ ప్రాంతానికి దిగుమతి అయిన ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఈ వ్యవహారానికి నాయకత్వం వహించాలంటూ భూమన ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో దౌర్జన్య కాండ అంతులేకుండా పోతోందని, చంద్రబాబు పాలనలో దుర్మార్గాలు జరుగుతున్నాయి అని చెప్పడానికి నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన నిదర్శనం అని తెలిపారు.

ఇలా కార్పొరేటర్ లపై జరిగినటువంటి ఈ చర్యలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ లకు సిగ్గుచేటు అంటూ మాట్లాడారు. ఏదైనా అంటే మీ పాలనలో కూడా ఇలాగే సాగింది కదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు ఇక తరచూ మహిళలు అంటే నాకు గౌరవం మహిళలకే ప్రాధాన్యత ఇస్తా అంటూ మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . మీ కథ చాలా గొప్పగా నడిచిందని అనుకుంటే చాలా తప్పు అని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మీరు చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు అన్నీ బయటకి వచ్చాయి మీ పచ్చ పత్రికల ద్వారా ప్రజలను మభ్యపెట్టిన నిజాలు దాగవు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.