AP: పవన్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్లాల్సిందే… పవన్ కు కౌంటర్ ఇచ్చిన అంబంటి రాంబాబు!

AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో కూటమి పార్టీపై వైసీపీ వైసీపీ పై కూటమి పార్టీలో సెటైర్లు వేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసిపి నేతలు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన 10 నిమిషాలకే బయటకు వచ్చేసారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు అయితే వైసిపికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష హోదా రాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి కనుక ఈ పార్టీకి ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రావడం అనేది అసలు జరగదని తెలిపారు. జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువగా వచ్చి ఉంటే ఈ పార్టీకి ప్రతిపక్ష హోదా పార్టీ వచ్చేదని పవన్ తెలిపారు. ఇక ఓటింగ్ శాతం బట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఆయన జర్మనీకి వెళ్లాలి అంటూ పవన్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు అంబంటి రాంబాబు కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అంబంటి రాంబాబు X వేదికగా స్పందిస్తూ… పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే గోవా వెళ్లాల్సిందే అంటూ ఈయన పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోవాలో అసెంబ్లీ స్థానాలు కేవలం 40 మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేజిక్ ఫిగర్ 21.

ఎన్నికలలో జనసేన పార్టీకి కూడా 21 సీట్లు వచ్చాయి కనుక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటే గోవాకు వెళ్లి అక్కడ పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఆయనకు కౌంటర్ ఇస్తూ ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది
ఏది ఏమైనా అంబంటి రాంబాబు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారింది.