Ambanti Rambabu: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న వారిలో అంబంటి రాంబాబు ఒకరు. మాజీ మంత్రిగా ఉన్న ఈయన ప్రస్తుతం పార్టీ ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు కౌంటర్ ఇస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పై తోక తొక్కిన తాచుల ఎగిరిపడే అంబంటి రాంబాబు తాజాగా పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ…
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి.. కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అంటూ అంబంటి రాంబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పై ఒంటి కాలు మీద లేచి విమర్శలు చేసే అంబటి రాంబాబు ఇలా ఉన్నపలంగా పవన్ సినిమా సక్సెస్ కావాలని కోరుకోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే పవన్ సినిమా గురించి అంబంటి ఇలా కోరుకున్నారా? ఇది నిజమా? కళా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం రాజకీయ నాయకులు అటు సినిమా సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా హిస్టారికల్ పీరియాడిక్ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరి హరిహర వీరమల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు రాత్రి 9:00కి ఈ సినిమా ప్రీమియర్ షో ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ రాబోతుంది. పవన్ తన సినిమాతో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకో బోతున్నారనేది తెలియాల్సి ఉంది.
