Y.S.Jagan: పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ…. ఎమ్మెల్యేకు తక్కువ… జగన్ మాస్ కౌంటర్!

Y.S.Jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి అయితే ఇలా 11 స్థానాలు రావడంతో ఆయనకు ప్రతిపక్ష నేతగా హోదా కూడా లేకుండా పోయింది. కానీ చట్టసభలలో ప్రజల సమస్యలను వివరించాలి అంటే కొంత సమయం కావాలి ఆ సమయం కేవలం ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇస్తారు కనుక తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అలాగే స్పీకర్ అయ్యన్నపాత్రుడికి కూడా లేఖ రాశారు.

ఇక ఇటీవల బడ్జెట్ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులదరూ అసెంబ్లీకి హాజరయ్యి తమకు ప్రతిపక్ష పార్టీగా హోదా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తూ కొంత సేపటికి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. ఇలా వైసిపి నేతలు వ్యవహరించిన తీరును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఆయన జర్మనీకి వెళ్లాల్సి ఉంటుందని ఈ ఐదు సంవత్సరాలు ఆయనకు ప్రతిపక్ష హోదా రాదు అంటూ తేల్చి చెప్పారు.

ఇలా పవన్ కళ్యాణ్ జగన్ ప్రతిపక్ష హోదా గురించి విమర్శలు చేయడంతో తాజాగా నేడు ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ విమర్శల కురిపించారు. ఆయన తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు అంటూ జగన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.