ఉపాసన ధరించిన డ్రెస్ ధర తెలిస్తే కచ్చితంగా నోరెళ్ళబెడతారు.. ఎన్ని లక్షలో తెలుసా?

అపోలో వైద్య సంస్థల అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉపాసన ఒక స్టార్ హీరోకి భార్యగా మాత్రమే కాకుండా ఒక ఒక మంచి మనసున్న వ్యక్తి గా ప్రజలలో చెరగని అభిమానాన్ని సొంతం చేసుకుంది. అపోలో వైద్య సంస్థలకు అధినేత్రి అయిన ఉపాసన సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో విషయాల గురించి వీడియోల ద్వార తెలియచేస్తూ ఉంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రజల మనసుల్లో గొప్ప వ్యక్తిగా చేరగని ముద్ర వేసుకుంది. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా ఇద్దరూ ఇటలీ కి వెకేషన్ కి వెళ్ళారు.

2012 సంవత్సరంలో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట తాజాగా తమ పదవ వివాహ వార్షకోత్సవాన్ని జరుపుకున్నారు. గత పది సంవత్సరాలుగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల తమ పెళ్లి రోజు సందర్భంగా చరణ్, ఉపాసన ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీలో తమ పెళ్లిరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. చరణ్, ఉపాసన తమ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఉపాసన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటలీ వెకేషన్ లో ఉపాసన ధరించిన డ్రెస్ ధర ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గ్రీన్ కలర్ డ్రెస్ లో రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా 2,23,049 రూపాయలు ఉంటుందని సమాచారం. అలాగే ఆ ఫోటోలోరామ్ చరణ్ ధరించిన డ్రెస్ ఖరీదు దాదాపు 1,13,000 రూపాయలు ఉంటుందని సమాచారం. మొత్తానికి ఇద్దరూ ఈ ఫోటోలో చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.