దూతగా మర్చిపోలేని పర్ఫామెన్స్ చేశావు.. ఐ హేట్ యు రష్మిక.. సాయి ధరమ్ పోస్ట్ వైరల్!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్లకి రప్పిస్తుంది.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేవలం ఈ సినిమా తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విజయంపై ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించి చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విజయం పై ప్రముఖ నటుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీతారామం సినిమాకి రివ్యూ ఇచ్చారు.ఐ హేట్ యు అంటూనే ఈ సినిమా కోసం పనిచేసిన నిర్మాతలు దర్శకులు నటీనటులు గురించి ఈయన ఎంతో గొప్పగా ప్రశంసిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇకపోతే ఈ సినిమాలో రష్మిక ఆఫ్రిన్ అనే ముస్లిం యువతి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ ఐ హేట్ యు అని చెబుతూనే తన నటనపై ప్రశంసలు కురిపించారు. ఒక దూతగా సీతకు రామ్ పంపిన సందేశాన్ని చేరవేర్చి మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ చేశావు.నీ నటన చూసి ఐ హేట్ యు అనాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన రష్మిక పర్ఫామెన్స్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.