మీరు లెజెండ్ సార్ … నాకు అర్హత లేదు విక్రమ్ సినిమాపై మహేష్ బాబు కామెంట్స్!0

సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒకరి సినిమాల గురించి మరొకరు పొగడుతూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కమల్ హాసన్ నటించిన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమాని కమలహాసన్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమా 400 కోట్ల రూపాయలను వసూలు చేసి కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక టాలీవుడ్ లో కూడా ఏడు కోట్లకు కొనుగోలు చేసిన ఈ సినిమా 17 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇటీవల ఈ విక్రమ్ సినిమాని చూసిన మహేష్ బాబు సినిమాని పొగుడుతూ..పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు.. ” విక్రమ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా.ఈ సినిమా ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ అని మహేష్ వర్ణించారు. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ టాలెంట్ గురించి పొగిడారు. ఇక విక్రమ్ సినిమా రూపొందించడం గురించి లోకేష్ కనకరాజ్ ని అడిగి తెలుసుకొన్నాను, అద్భుతమనిపించింది అంటూ మహేష్ రాసుకొచ్చారు.

అనంతరం ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి నటనను మహేష్ ప్రత్యేకంగా పొగిడారు. ఇక ఈ సినిమాకి అనిరుధ్ అందించిన మ్యూజిక్ మరో స్థాయిలో ఉన్నట్లు వర్ణించారు.ఇక చివరగా కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. మీ నటన గురించి చెప్పటానికి నా అర్హత సరిపోదు.అంటూ మహేష్ ఈ సందర్భంగా కమల్ హాసన్ గారికి కంగ్రాట్స్ చెప్పారు . ఒక అభిమానిగా నేను విక్రమ్ మూవీ చూసి గొప్పగా ఫీల్ అయ్యాను అంటూ మహేష్ రాసుకొచ్చాడు. కమల్ హాసన్ గురించి, విక్రమ్ సినిమా గురించి మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.