Mega fans : అవునా.! నిజమేనా.! మెగా ఫ్యాన్స్ కోరిక తీరిపోనుందా.?

Mega fans : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే స్ర్కీన్‌పై కనిపిస్తే, ఫ్యాన్స్ కళ్లలో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పటి నుంచో ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేములో చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఆ కోరిక త్వరలోనే నెరవేరిపోనుందంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు.

సెకండ్ ఇన్నింగ్స్ పేరు చెప్పి ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ తమ సినిమాలతో తెగ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇదే టైమ్‌లో వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ కూడా తీసేస్తే ఓ పనైపోతుందని మేకర్లు స్కెచ్‌ల మీద స్కెచ్‌లు డిజైన్ చేసేస్తున్నారట.

ఆల్రెడీ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఓ ఫైట్ సీన్‌లో నటించాడు చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్. అలాగే, చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ కోసం పవన్ కళ్యాణ్ తన వాయిస్ అందించాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేయడమే తరువాయి.

అప్పుడెప్పుడో ప్రముఖ నిర్మాత సుబ్బిరామిరెడ్డి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనీ, దానికి ఆయనే నిర్మాత అనీ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనీ అనౌన్స్ చేసేసిన సంగతి తెలిసిందే. అయితే, కరెక్టుగా అదే టైమ్‌లో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి, రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అలా ఆ ప్రాజెక్టు కేవలం అనౌన్స్‌మెంట్‌కే పరిమితమైపోయింది.

ఇప్పుడు అటు పవర్ స్టార్, ఇటు మెగాస్టార్ ఇద్దరూ ఫుల్ స్వింగ్‌లో వున్నారు. సో, ఇదే సరైన సమయం. వీలైనంత త్వరగా ఈ కాంబినేషన్ పట్టాలెక్కించేయాలని కొందరు నిర్మాతలు తెర వెనుక మంతనాలు సాగిస్తున్నారట.