వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనదిగా చెప్పబడుతున్న ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ, అందులో అసభ్యకరమైన చేష్టలు చేస్తున్నారు గోరంట్ల మాధవ్.! అయితే, అందులో వున్నది నిజంగానే గోరంట్ల మాధవ్ అనుకోవాలా.? లేదంటే, ఇదేమైనా మార్ఫింగ్ వీడియోనా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. పోలీస్ అధికారిగా వున్న సమయంలో కూడా ఆయన మీద పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డితో తలెత్తిన వివాదం ఆయన్ని రాజకీయాల్లోకి లాగింది. జేసీ దివాకర్ రెడ్డిని ఢీకొని, ధైర్యంగా నిలబడ్డ గోరంట్ల మాధవ్, అనూహ్యంగా ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చి.. రాజకీయాల్లోకి వస్తూనే ఎంపీ అయిపోయారు.
గోరంట్ల మాధవ్ వైసీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేసేందుకు అప్పట్లో టీడీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాగైతేనేం, ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు.. గెలిచాక టీడీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజకీయంగా.
ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ మీద కుట్ర పన్నిన టీడీపీ, ఓ మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తీసుకొచ్చిందన్నది గోరంట్ల మాధవ్ అభిమానుల తరఫున వినిపిస్తోన్న వాదన. అయితే, ఈ విషయమై గోరంట్ల మాధవ్ ఇంకా స్పందించాల్సి వుంది.
ఇదిలా వుంటే, ‘పిన్నిని చున్నీతో ఉరివేసి చంపేసిందెవరు.?’ అంటూ సోషల్ మీడియాలో టీడీపీ నేత నారా లోకేష్ మీద ఓ పోస్టింగ్ వైరల్ అవడంతో, దానికి విరుగుడుగా గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతూ ఓ ఫేక్ వీడియో ప్రచారంలోకి తెచ్చారనే వాదన కూడా లేకపోలేదు.