Shyamala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈమె రాష్ట్రంలో ప్రస్తుతం మహిళల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ మాట్లాడారు..
ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దిశా యాప్ ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించామని తెలిపారు. అపద్ధపు హామీలతో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చే ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆడబిడ్డల రక్షణ గాలికి వదిలేసారని తెలిపారు.
స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. గతంలో ఆడబిడ్డల రక్షణ గురించి అలాగే రాష్ట్ర భవిష్యత్తు గురించి తెగ ఊగిపోతూ మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.
మనం అధికారంలోకి వస్తే ఆడబిడ్డల రక్షణ బాధ్యత నాదని చెప్పిన పవన్ ఇప్పుడేమయ్యారు అంటూ వరుసగా కూటమి నేతలను ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి హయామంలో నవరత్నాలు పూర్తిగా అమలు అయ్యాయి అంటూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా ఈమె చూపించారు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన సూపర్ సెక్స్ హామీలను కూడా నెరవేర్చలేక పోతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలకు మాత్రమే పరిమితం చేయడం సిగ్గుచేటు అని తెలిపారు..
ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకు క్రెడిబులిటీ లేదని, మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటూ శ్యామల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
