బాక్సాఫీస్ : ఫస్ట్ డే యూఎస్ లో “యశోద” సంచలనం.!

స్టార్ హీరోయిన్ సమంతా తన కెరీర్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటు ప్రొఫిషనల్ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తుంది. అలా కష్టాల్లోనే తాను నెట్టుకుంటూ చేసిన లేటెస్ట్ సినిమా “యశోద”, డైరెక్టర్స్ హరీష్ మరియు హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం సమంత కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కి రాగ..

ఈ చిత్రం సామ్ కెరీర్ లో సాలిడ్ ఓపెనింగ్స్ అయితే అందుకోనున్నట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి నిన్ననే యూఎస్ మార్కెట్ లో కుష్ ప్రీమియర్స్ తో అలాగే ఫస్ట్ డే కంప్లీట్ అవ్వకుండా లక్ష డాలర్స్ కి పైగా కొల్లగొట్టగా ఇపుడు ఈ సినిమా ఊహించని విధంగా సంచలనమే నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ప్రీమియర్స్ కి కేవలం 60 వేల డాలర్స్ నమోదు అయ్యినప్పటికీ ఫస్ట్ డే టోటల్ గా ఏకంగా అయితే 2లక్షల డాలర్స్ మార్క్ ని ఈ చిత్రం అందుకొని సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇది మాత్రం మామూలు రెస్పాన్స్ అయితే కాదని చెప్పాలి.

మరి ప్రీమియర్స్ కి 65 వేల 685 డాలర్స్ వసూలు చేయగా మొదటి రోజుకి అయితే లక్ష 34 వేల 886 డాలర్స్ వసూలు చేసిందట. దీనితో ఈ చిత్రం 2 లక్షల డాలర్స్ ని ఈ చిత్రం అందుకుంది. దీనితో ఈ భారీ రెస్పాన్స్ కి సమంత థాంక్స్ చెప్తుంది.