“కేజీఎఫ్ 3” పై అందరికీ క్లారిటీ ఇచ్చేసిన యష్.!

KGF 2 Creates Sensation

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో మన సౌత్ ఇండియా నుంచి వచ్చినవే కొన్ని ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో కన్నడ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.

ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ లో వచ్చిన ఈ చిత్రం ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ చిత్రం ఏకంగా 1200 కోట్ల భారీ వసూళ్లు అందుకొంది.

ఇక ఇంత పెద్ద హిట్ అయ్యిన ఈ సినిమాకి మరో సీక్వెల్ ఉంది అనే అంశం అనౌన్స్ చెయ్యడం క్రేజీ గా మారింది. ఇక్కడ నుంచి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే అంశాలు హాట్ టాపిక్ కాగా కొన్ని అప్డేట్స్ అయితే వైరల్ కూడా అయ్యాయి. 

మరి ఇప్పుడు ఈ చిత్రంపై స్వయంగా రాకింగ్ స్టార్ యష్ నుంచే భారీ అప్డేట్ రావడం బయటకి వచ్చింది. మరి నేషనల్ మీడియా తో తాను కేజీఎఫ్ చాప్టర్ 3 ఇప్పుడప్పుడే మొదలు కావడం జరగదని లేట్ గానే ఈ సినిమా స్టార్ట్ చేస్తామని అయితే యష్ కన్ఫర్మ్ చేసాడు.

ఆలోపు వచ్చే రూమర్స్ అయితే ఎవరు నమ్మొద్దు అని ఏదైనా ఉంటే తన నుంచి సినిమా యూనిట్ నుంచి మాత్రమే అధికారికంగా వస్తాయని యష్ కన్ఫర్మ్ చేసాడు. దీనితో కేజీఎఫ్ 3 రూమర్స్ పై అయితే ఓ క్లారిటీ అందరికీ వచ్చింది.