Rajamouli Brand Allu Arjun : రాజమౌళి బ్రాండ్ లేకుండా చరిత్ర సృష్టించబోతున్న అల్లు అర్జున్.!

Rajamouli Brand Allu Arjun : తెలుగు సినిమాని హిందీ గడ్డపై ఓ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తన సినిమాలతోనే పాన్ ఇండియన్ క్రేజ్ ని ప్రభాస్ అయితేనేమి ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కానీ తెచ్చుకున్నారని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు.

అందుకే వీరిపై రాజమౌళి స్టాంప్ అయితే ఖచ్చితంగా పడిపోయి ఉంటుంది. కానీ ప్రభాస్ రాజమౌళి స్టాంప్ నుంచి బయటకొచ్చి తనకంటూ సెపరేట్ క్రేజ్ ని బాక్సాఫీస్ స్టామినా ని హిందీ మార్కెట్ లో తెచ్చుకున్నాడు. మరి ఇవేవీ లేకుండా ఒక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన సొంత క్రేజ్ తో హిందీ బెల్ట్ లో హిస్టరీ నమోదు చెయ్యబోతున్నాడని తెలుస్తుంది.

హిందీలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప పార్ట్ 1” హవా ఇంకా తగ్గలేదు. మరి ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 100 కోట్ల వసూళ్ల లెక్కను అక్కడ అందుకోవడానికి అతి చేరువలో ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇదే కానీ నిజం అయితే తన మొదటి సినిమాతోనే అది కూడా రాజమౌళి బ్రాండ్ లేకుండా 100 కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. ఇప్పుడు అయితే పుష్ప 96 కోట్ల మేర అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ మిగతా మొత్తాన్ని ఖచ్చితంగా అందుకుంటాడని బి టౌన్ పీపుల్ చెబుతున్నారు.