Acharya – “ఆచార్య” ఘోర విఫలంకి ప్రధాన కారణాలా..?

Acharya Became Huge Disaster : ఒక్క ఈ ఏడాదిలోనే కాకుండా ఆల్ టైం తెలుగు సినిమా దగ్గర ఒక భారీ డిజాస్టర్స్ లో నెంబర్ 1 సినిమాగా నిలిచిపోయిన సినిమా “ఆచార్య”. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా అనుకోని ఫలితాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా ఫలితం గాని ఇచ్చే నష్టాలు గాని చెప్పుకుంటే మెగా ఫ్యాన్స్ నిద్ర పట్టదు.
ఆ రేంజ్ లో ఒక ఎపిక్ డిజాస్టర్ గా నిలిపోయింది. నిన్న ఆదివారం కూడా థియేటర్ లు నిండలేదు అంటే ఇక అర్ధం చేసుకోవాలి ఈ సినిమా ఏ స్థాయి విఫలం అయ్యిందో. అయితే ఈ సినిమా డిజాస్టర్ కి కొన్ని సెంటిమెంట్స్ తప్పక చూస్తే మాములుగా ఏదో ఒక సెంటిమెంట్ మాత్రమే ఉంటుంది కానీ దీనికి మాత్రం దురదృష్టవశాత్తు రెండు కలిసాయి అందుకే ఏమో తెలుగు సినిమా దగ్గర ఏ సినిమా కూడా ఇవ్వని భారీ స్ధాయి నష్టాలను మిగిల్చింది.
అయితే మొట్ట మొదటి మాట రాజమౌళి తర్వాత చరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఆ సెంటిమెంట్ రీత్యా ప్లాప్ కాగా మరొకటి హీరోయిన్ పూజా హెగ్డే సెంటిమెంట్ అని చెప్పాలి. ఆమె నటించిన లాస్ట్ అన్ని సినిమాలు కూడా భారీ ప్లాప్ లు అయ్యాయి దీనితో ఈ సినిమా పై కూడా అంతా డౌట్ పడ్డారు. కానీ చివరికి ఇది కూడా నిజం అయ్యింది.
మొత్తానికి అయితే ఈ రెండు సెంటిమెంట్స్ నుంచి తప్పించుకోలేక ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యిపోయింది. దీనితో మెగాస్టార్ సాలిడ్ కం బ్యాక్ కోసం అయితే అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి భవిష్యత్ లో మెగాస్టార్ తన రేంజ్ హిట్ కొడతారా లేదో చూడాలి.