“RRR” తో “పుష్ప” ని కూడా రిలీజ్ చేస్తున్న బిగ్ బ్యానర్.!

మన దక్షిణాది సినిమా దగ్గర పలు భారీ సినిమాలు తెరకెక్కించాలి అంటే పెద్ద నిర్మాణ సంస్థలు తప్పనిసరి. అలాంటి వాటిలో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఒకటి. రజినీ తో 2.0, తర్వాత కమల్ తో “భారతీయుడు 2” లాంటి ఖరీదైన సినిమాలు వారు చేసారు. ఇంకా మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ బి బ్యానర్ మన తెలుగు నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ని తమిళ్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

భారీ ధరకి ఈ సినిమాని కొని వారు రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఇదే బ్యానర్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సినిమా అయినటువంటి “పుష్ప” ని కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం. నిన్ననే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్ లో రిలీజ్ అంటే గ్రాండ్ గానే సినిమాలో కంటెంట్ ఉన్నట్టే అర్ధం మరి అక్కడ పుష్ప ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.