Pawan Kalyan : ఇండస్ట్రీ టాక్ : పవన్ ఒక్కడి పేరు మీదే మొత్తం జరుగుతుందట.!

Pawan Kalyan : మన టాలీవుడ్ లో ఉన్నటువంటి అందరి స్టార్ హీరోలకి ఎవరి క్రేజ్ వాళ్లకి సెపరేట్ ఉంటుంది. అయితే ఈ అందరిలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ సెపరేట్ అని చెప్పాలి. అదే అతడికి ఉన్న అపారమైన బలం అందుకే హిట్స్ లేకుండా కూడా ఏకంగా పదేళ్లు సర్వైవ్ అయ్యాడు.

మరి మళ్ళీ ఇప్పుడు పవర్ స్టార్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో తన లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” చూపిస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక చేసిన రెండో సినిమా ఇది. పైగా ఇది కూడా రీమేక్ సినిమానే అయినా దీనికి జరుగుతున్న బిజినెస్ కోసం ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఇప్పుడు నెలకొందట. కేవలం పవన్ ఒక్కడి పేరు మూలాన డిస్ట్రిబ్యూటర్లు ఎంతైనా పెట్టేందుకు ముందుకు వస్తున్నారట. దీనితో భీమ్లా నాయక్ పై హైప్ కోసం ఇండస్ట్రీ వర్గాలు ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నాయి.

మరి సినిమా రిలీజ్ అయ్యాక ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో కానీ ఇప్పుడు అయితే భీమ్లా నాయక్ కి మంచి డిమాండ్ నెలకొంది. ఇక ఈ సినిమాలో రానా కూడా ప్రధాన పాత్రలో నటించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించారు.