Vijay’s Beast : “కేజీఎఫ్ 2” కి పోటీగా పాన్ ఇండియా అనౌన్సమెంట్ ఇచ్చిన విజయ్ “బీస్ట్”.!

Vijay’s Beast : మళ్ళీ పాన్ ఇండియా స్థాయిలో భారీ పోటీ వాతావరణం సినిమాల్లో ఎంతో నెలకొంది. గత మార్చ్ 11న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి “రాధే శ్యామ్” తో మొదలైన హవా ఇప్పుడు బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR) అన్ని బాక్సాఫీస్ లెక్కలేని తెలుస్తుంది.
అయితే మళ్ళీ ఈ సినిమా స్థాయిలో పాన్ ఇదని లెవెల్లో పెర్ఫామ్ చెయ్యగలిగే మరో సినిమా ఏదన్నా ఉంది అంటే అది మాత్రం భారీ చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2” అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఇలాంటి సినిమాలు ఉన్నపుడు సాధారణంగా ఎవరూ పోటీకి రారు కానీ తమిళ నాట స్టార్ హీరో తలపతి విజయ్ మాత్రం తన సినిమా “బీస్ట్” తో నిలబడ్డాడు.
జస్ట్ కొన్ని రోజులు కితమే కేజీఎఫ్ కన్నా ఒకరోజు ముందు సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇపుడు దానికి పోటీగా పూర్తి స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేస్తున్నట్టుగా అన్ని భాషల రిలీజ్ ని అనౌన్స్ చెయ్యడం ఆసక్తిగా మారిపోయింది.
లేటెస్ట్ గా హిందీ సహా కన్నడ, మళయాళ తెలుగు రిలీజ్ లపై క్లారిటీ ఇస్తూ ప్రకటన ఇచ్చారు. మరి ఈ అనౌన్సమెంట్ కేజీఎఫ్ ధాటి ముందు నిలబడుతుందో లేదో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే వరుణ్ ‘డాక్టర్’ సినిమా ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం అందించాడు.