Pawan Kalyan: సినీ నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగా రాజకీయాలలోకి వచ్చారు. ఇక ఈయనకు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయడం కోసం జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల వైపు అడుగులు వేశారు అయితే ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే మరోవైపు సినిమాలు చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలుపొందడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఈయన బాధ్యతలు తీసుకున్నారు. ఇలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించడం అంటే చాలా కష్టమవుతుంది అందుకే ఈయన ఇకపై సినిమాలకు దూరం అవుతారని పవన్ కళ్యాణ్ ను తెరపై చూడటం కష్టమని అభిమానులు ఎంతో మధనపడుతున్నారు.
ఇలాంటి తరుణంలోనే సినిమాలలో నటించడం గురించి పవన్ కళ్యాణ్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇటీవల ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో ఈయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎక్కువ మీరు సినిమాలు చేస్తారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ తనకు రాజకీయాల పరంగా డబ్బు అవసరమైనంత వరకు సినిమాలలో నటిస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.
పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండానే రెండు బ్యాలన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని వివరించారు. జనసేన నిర్వహణ, ప్రచారం, సహాయాలు, విరాళాలు, దత్తతలు ఇలా ఎన్నో కార్యక్రమాల కోసం పవన్ కు ఆర్థిక మద్దతు ఎప్పటికప్పుడు అవసరమవుతూనే ఉంటుంది కనుక ఈయన తప్పనిసరిగా సినిమాలు చేస్తానని చెప్పకనే చెప్పేసారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తానని చెబుతున్నారు కానీ ఈయన ఎన్నికలకు ఒక ఏడాది ముందు కమిట్ అయిన సినిమాలను ఇప్పటివరకు పూర్తి చేయలేకపోతున్నారు ఇలాంటి తరుణంలో కొత్త వాటికి కమిట్ అయితే ఆ సినిమాలకు న్యాయం చేయగలరా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈయన డిప్యూటీ సీఎం గా ఉంటూ కొత్త సినిమాలకు కమిట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.