Beast : హీరో విజయ్ ‘బీస్ట్’తో అయినా సక్సెస్ అవుతాడా.?

Beast : తమిళ హీరో విజయ్ ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంటాడు తెలుగు రాష్ట్రాల్లో. ఇతర హీరోల సినిమాలకు మార్కెట్ జరిగినట్లు, విజయ్ నటించిన సినిమాల డబ్బింగ్ వెర్షన్లకు తెలుగులో మార్కెట్ వుండదు. కారణమేంటి.? అంటే, అదో మిలియన్ డాలర్ల ప్రశ్న.

కొన్ని సినిమాలు మమ అనిపిస్తాయి.. కొన్ని మరీ దారుణమైన ఫలితాల్ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటాయి. అంతే తప్ప, విజయ్ హీరోగా వచ్చిన సినిమాలు తెలుగునాట హిట్టయిన సందర్భాలే వుండవు. తమిళంలో హిట్టు, తెలుగులో ఫట్టు.. ఇదీ విజయ్ పరిస్థితి.

తాజాగా ‘బీస్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు విజయ్. ‘పాన్ ఇండియా’ అనదగ్గ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఏం లాభం.? తెలుగునాట ఈ సినిమాకి సరైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది లేదు.

అసలు ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా ఆసక్తి కూడా లేదు.

అన్నట్టు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో కొందరు విజయ్ అభిమానులు చాలా ఓవరాక్షన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చేలా గట్టి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

దీంతో, విజయ్ సినిమా ‘బీస్ట్’కి తెలుగునాట సెగ తప్పేలా లేదు. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం కాస్తా తెలుగులో ఈ సినిమాపై కొంచెం క్రేజ్ కనిపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు.