వరదలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయా ..?

ts congress

 తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు భాగ్యనగరం వణికిపోతోంది. దాదాపు వారం రోజుల నుండి కొన్ని ప్రాంతాలు వరదల్లోనే చిక్కుకొని ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాగం రాత్రియంబవళ్ళు పనిచేస్తున్న కానీ ఫలితం లేకుండా పోతుంది. దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. అధికార పార్టీ నేతలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళను కాలర్ పట్టుకొని ప్రశ్నించే స్థాయికి సామాన్యులు వెళ్లారంటే వాళ్లలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

hyderabad floods telugu rajyam

  ఈ వరదల ప్రభావం ఖచ్చితంగా రేపు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఉంటుంది. అధికార పార్టీ కి వ్యతిరేక ఓట్లు పెరిగే అవకాశం ఉంది. వరదలకి ముందుదాకా గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ను ఢీ కొట్టి గెలవాలంటే అసాధ్యమనే అనుకున్నారు,ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలో అర్ధం కాలేదు. గ్రేటర్ లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ పనితీరుపై కొంచం వ్యతిరేకత ఉన్నకాని అది ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో లేదు. దీనితో ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి తప్పదని మానసికంగా కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో వరదలు రావటం, హైదరాబాద్ నగరంలోని అనేక లోపాలు బయటపడటం, తెలంగాణ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఘోరంగా విఫలం కావటం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం ఇవన్నీ కూడా స్థానిక ప్రజానీకంలోకి చొచ్చుకొని వెళ్లాయి.

  ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని వరదలు చేయటం ఇక్కడ విశేషం. దీనితో ఎలాంటి అవకాశం కోసమైతే ఎదురు చూస్తున్నారో సరిగ్గా అలాంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి చిక్కింది. ఎలాగైనా సరే ఈ లోపాలను ఎత్తి చూపిస్తూ, తెరాస ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. వెతకబోయిన తీగ కాలికే తగినట్లు అయ్యింది కాంగ్రెస్ పరిస్థితి. ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికలు ఉండటంతో పార్టీ లోని సీనియర్ నేతలందరూ దుబ్బాకలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారు.. ఆ ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే గ్రేటర్ ను టార్గెట్ చేయాలనీ చూస్తున్నారు. ఎలాగైనా సరే ఈ వరద రాజకీయాలను తమకు అనుకూలంగా మలుచుకొని తెరాస ను గట్టి దెబ్బ తీయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్జీవంగా మారిపోయిన కాంగ్రెస్ కు ఈ వరదలు ఊపిరిపోశాయనే చెప్పాలి