Rajamouli : రాజమౌళి అలాంటి పని మళ్లీ చేస్తాడా.?

Rajamouli : రాజమౌళి సినిమా అంటేనే చాలు అంచనాలు అమాంతం ఆకాశాన్నంటేస్తాయ్. అవును మరి, ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఆయన. ఆయన సినిమా అంటే మావులుగా వుండదు. స్టార్ హీరోలు, స్టార్ టెక్సీషియన్లు, అంతా ఫైవ్ స్టార్ లెవల్ వుంటుంది మరి.
అలాంటిది రాజమౌళి ఓ చిన్నసినిమాకి దర్శకత్వం వహిస్తాడా.? అవుననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్న రాజమౌళి మనసులో ఈ సినిమా తర్వాత ఓ చిన్నసినిమా తీసే అవకాశాలున్నాయని చూజాయగా తెలిసింది.
కరెక్టుగా చెప్పాలంటే ‘మర్యాదరామన్న’ లాంటి ఓ పెద్ద సైజు ఎంటర్‌టైన్‌మెంట్ చిన్నసైజు సినిమా అన్నమాట. కొత్త ఆర్టిస్టులతో తక్కువ బడ్జెట్‌తో ఆ సినిమా రూపొందించాలనుకుంటున్నాడట జక్కన్న. వీలైనంత త్వరగా ఆ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట కూడా.
వాస్తవానికి రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేయాల్సి వుంది. అయితే, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలి. జూలైలో ఆ సినిమా పట్టాలెక్కనుంది. మరి, ఈ సినిమా పూర్తయితే కానీ, రాజమౌళి ప్రాజెక్టు టేకప్ చేయలేడు మహేష్.
సో, ఈ లాంగ్ గ్యాప్‌లో ఓ చిన్న సినిమాని జక్కన్న నిజంగానే ప్లాన్ చేస్తాడా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!