దేవరకొండతో చేస్తానంది.. మరి మహేష్ బాబుతో చేస్తుందా ?

Will Janhvi Kapoor agreed to do film with Mahesh

Will Janhvi Kapoor agreed to do film with Mahesh

స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల కష్టాలు తీరట్లేదు. తెలుగులో ఉన్న ముగ్గురు నలుగురు హీరోయిన్లనే అటు ఇటు తిప్పుతున్నారు. స్టార్ హీరోలు చాలామంది ఆ ముగ్గురు నలుగురు హీరోయిన్లతో ఇప్పటికే వర్క్ చేసేశారు. దీంతో కొత్త జోడీలు కోసం వెతుకులాట మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయనున్నారు.ఇందులో హీరోయిన్ ఎవరనేది పెద్ద టాపిక్ అయిపోయింది. ఎందుకంటే మహేష్ ఇప్పటికే పూజా హెగ్డే, కియరా అద్వానీ, రష్మిక మందన్నలతో సినిమాలు చేసేశారు. ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేష్ చేస్తోంది.

అందుకే ఈసారి కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట మొదలైంది. త్రివిక్రమ్ దృష్టిలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఉంది. బాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమెను తెలుగులోకి తీసుకురావడానికి తండ్రి బోనీ కపూర్ ఆసక్తిగానే ఉన్నారు. జాన్వీ కపూర్ అయితే గతంలో మీరు తెలుగులో సినిమా చేస్తే ఏ హీరోతో వర్క్ చేస్తారు అంటే తడుముకోకుండా విజయ్ దేవరకొండ అనేసింది. ‘అర్జున్ రెడ్డి’ తరవాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చాలామంది హీరోయిన్లు అనుకున్నారు. వారిలో జాన్వీ కపూర్ కూడ ఉంది. మరి దేవరకొండతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్న ఆమె మహేష్ సినిమాలో చేయడానికి కూడ అంతే ఆసక్తి చూపుతుందా లేదా అనేది చూడాలి.