జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తారు తప్ప తెలంగాణలో సైలెంట్ గా ఉంటార్నది అందరికీ తెలిసిందే. ఒక దేశపు జాతీయ జెండాకు ఉన్నంత పొగరు ఆయనకున్నా ఆ పొగరు ఏపీలో మాత్రమే బయట పెడతారు. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తాను అన్న ఆయనా? ఇప్పుడు కేవలం ఏపీ తప్పిదాలనే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కేవలం ఏపీలో రాజకీయంగా పట్టు సాధించడం కోసమే. ఇక్కడ అధికార పక్షంపై ఆయన ఎలాంటి కామెంట్లు అయినా చేస్తారు? అదే తప్పులు తెలంగాణ లో జరిగితే మాత్రం నో కామెంట్ అనేస్తారు. ఓసారి మచ్చుకు ఇలాగే తెలంగాణ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే కేసీఆర్ అండ్ కో ప్రతి దాడితో విరుచుకుపడ్డారు.
అప్పటి నుంచి పవన్ అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం పూర్తిగా మానేసారు. ఇది ఇప్పటివరకూ తెలంగాణ విషయంలో పవన్ కళ్యాణ్ ఫింగరింగ్. అయితే ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ని తల దూర్చేలా చేస్తున్నారా? అంటే అవుననే గుస గుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అద్యక్షుడిగా ఎన్నికైన తర్వత బండి సంజయ్ కి పవన్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. తాజాగా వీరిధ్దరు భేటి అయ్యారు. బీజేపీ వర్గాలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఈ భేటి అని చెబుతున్నా! రాజకీయాలు లేని భేటిలు ఎందుకు? అన్న కామన్ క్వశ్చన్ రెయిజ్ అవుతుంది ఎవరికైనా.
ఏపీలో బిజేపీతో కలిసి పనిచేస్తున్నట్లు తెలంగాణలో కూడా జనసేన-బిజీపీలు కలిసి పనిచేయాలి అన్న ఎజెండాతోనే ఈ భేటి జరిగి ఉండొచ్చని ఊహాగానాలొస్తున్నాయి. అయితే అదంత ఈజీగా జరిగే పని కాదు. ప్రస్తుతం పవన్ పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అటు రాజకీయాలు-ఇటు సినిమాలతో పవన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తీరుపై విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. మాజీ సీబీఐ జేడీ లక్ష్మినారయణకు ఆ వైఖరి నచ్చకే జనసేనకు గుడ్ బై చెప్పారు. తాజాగా పవన్ తెలంగాణ రాజకీయాల్లో కూడా తలదూర్చితే? పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణ వినిపిస్తోంది.