Bigg Boss : బిగ్ బాస్ ఓటీటీ.. వర్కవుటయ్యే వ్యవహారమేనా.?

Bigg Boss : బిగ్ బాస్ తెలుగు ఈసారి ఓటీటీ వెర్షన్‌గా అలరించబోతోంది. ఇరవై నాలుగ్గంటలూ అదే పని.. అంటే కష్టమేమో కదా.! అయినాసరే, హిందీలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. అక్కడ ‘ఓకే’ అనిపించుకుంది. కానీ, తెలుగులో వర్కవుట్ అవుతుందా.? ఈ ప్రశ్నకు సమాధానం ముందు ముందు తెలియనుంది.

ప్రోమో వదిలారు.. సోషల్ మీడియాలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వార్తలు షురూ అయ్యాయి. ఎవరెవరు ఈ కొత్త ఓటీటీ బిగ్ బాస్ కోసం కంటెస్టెంట్లుగా రాబోతున్నారన్నదానిపై బోల్డన్ని స్పెక్యులేషన్స్. కాగా, హోస్ట్ మాత్రం అక్కినేని నాగార్జున. సో, పరమ రొటీన్ వ్యవహారం కాబోతోందన్నమాట.

వీకెండ్స్ ఎలా వుండబోతున్నాయి.? రోజువారీగా ఇరవై నాలుగ్గంటలూ చూపించేంత కంటెంట్ అక్కడేముంటుంది.? ఇలా చాలా అనుమానాలున్నాయి. ఏముంది బలవంతంగా ఓ జంటని, వీలైతే రెండు మూడు జంటల్ని కలిపేసి, అత్యంత దారుణంగా రొమాన్స్ వారితో వర్కవుట్ అయ్యేలా చేసేస్తారు.

కొట్లాటలు మామూలే. అన్నట్టు, ఓ జంట మధ్య కెమిస్ట్రీ క్రియేట్ చేయడానికే నానా తంటాలూ పడ్డారు. అది కూడా ప్రతిరోజూ కాదు.. అప్పుడప్పుడూ. అలాంటిది, ఇరవై నాలుగ్గంటలూ అలాంటి కంటెంట్ చూపించాల్సి వస్తే.?

ఏమో, బిగ్ బాస్ ఓటీటీ ఎలా వుండబోతోందోగానీ, ఈసారి ‘పెద్దలకు మాత్రమే’ అన్న భావన వీక్షకుల్లో అయితే కలుగుతోంది.