Poonam Kapoor vs Power Star : పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు.. ఆ హీరోయిన్ గరం గరం అవుతుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఎందుకంత గరం గరం.? ఆమె పేరు పూనమ్ కౌర్. మానసికంగా ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా అభిమానం. కానీ, సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ చేసే కామెంట్లు కొన్ని నెగిటివ్ షేడ్‌లో ప్రచారమవుతూ వుంటాయ్.
ఇదంతా పూనమ్ కౌర్ కావాలనే చేస్తుందని అంటుంటారు. పబ్లిసిటీ స్టంట్స్ అంటే ఈ అమ్మడికి పిచ్చ మోజనీ, అందుకోసమే, తనపై అటెన్షన్ నిలుపుకునేందుకే పవన్‌పై కావాలని నెగిటివ్ కామెంట్లు చేసి, సెన్సేషనల్ అవుతుందనీ అంటుంటారు.
ఆమె మాత్రం పవన్ అంటే తనకెంతో అభిమానమనీ, ఒక్కసారైనా ఆయనతో స్క్కీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కితే సంతోషపడతాననీ చెబుతుంటుంది. మరోవైపు గతంలోనే పూనమ్ కౌర్ పవన్ సరసన నటించాల్సి వుంది.
త్రవిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో పార్వతి మిల్టన్ పోషించిన పాత్రలో మొదట పూనమ్ కౌర్‌నే ఎంచుకున్నారట.
అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కీ, పూనమ్ కౌర్‌కీ మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ఛాన్స్ పార్వతి మిల్టన్‌కిచ్చేశాడంటూ ఓ సందర్భంలో త్రివిక్రమ్‌నీ ఆడిపోసుకుందీ అందాల భామ.
ఆ చిచ్చు మర్చిపోకుండా అలా అలా కంటిన్యూ చేస్తూ, త్రివిక్రమ్‌కి అత్యంత సన్నిహితుడైన పవన్ కళ్యాణ్‌ని కూడా ఆడిపోసుకోవడంలో ఆసక్తి చూపిస్తుంటుంది అప్పుడప్పుడూ ఈ అమ్మడు.
అన్నట్లు, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విషయంలోనూ పూనమ్ కౌర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. పవన్ కళ్యాణ్‌ని ‘బావ’ అని సంభోదిస్తూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.
జనం తమను మర్చిపోయారన్న అభిప్రాయం కలిగినప్పుడు ఒక్కసారి పవన్ కళ్యాణ్‌ని తిట్టేస్తే జనం దృష్టిలో పడిపోవచ్చనుకుంటారు కొందరు పిచ్చి సెలబ్రిటీలు. అదేంటో.. ఎవరి పిచ్చి వారికానందం.