Niharika Konidela : జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వుండడం వల్లే, ఆ పార్టీలో నాగబాబు యాక్టివ్ అవడం వల్లే ఇప్పుడు నిహారిక ఈజీ టార్గెట్ అయ్యిందా.? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. నిహారిక పబ్బుకి వెళ్ళడం తప్పు కాదు. దాన్ని నేరంగా పరిగణించలేం.
అసలు పబ్బులో ఏం జరిగింది.? పోలీసులెందుకు నిహారిక సహా పలువుర్ని అరెస్టు చేశారు.? అన్నదానిపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి వుంది.
నిబంధనలకు విరుద్ధంగా పబ్బుని నిర్వహిస్తున్నవారిపై కేసు నమోదవుతుంది.. అయ్యే వుంటుంది. ఇక, ఆ పబ్బులో డ్రగ్స్ వినియోగం జరిగిందనే ఆరోపణలున్నాయి.. వీటిపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాల్సి వుంది.
గతంలో.. అంటే, ముమైత్ ఖాన్, పూరి జగన్నాథ్ తదితరులు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, విచారణ ఎదుర్కొన్నప్పుడూ.. నానా యాగీ జరిగింది. అదిగో అరెస్టు, ఇదిగో ఇంత కాలం జైలు శిక్ష పడుతుంది.. అంటూ నానా రకాల పుకార్లూ షికార్లు చేశాయి.
చివరికి ఏమయ్యింది ఎక్సైజ్ సిట్.. ఆ కేసుతో ఎవరికీ సంబంధం లేదని తేల్చింది. రేప్పొద్దున్న నిహారిక విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ, నిహారిక టార్గెట్ అయ్యింది.
చాలామంది ప్రముఖుల పిల్లలు ఆ పబ్బులో అరెస్టయ్యారు. వాళ్ళ పేర్లు బయటకు రావడంలేదు. వాళ్ళ వీడియోలకూ మీడియాలో ప్రచారం లేదు.
కానీ, నిహారిక వ్యవహారం మాత్రం హైలైట్ అవుతోంది. మెగా కాంపౌండ్ ఈ విషయమై సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వుంది.