ది ఘోస్ట్ ప్లాప్ అయినా కానీ నాగార్జున ఎందుకంత హ్యాపీ?

చాలా కాలం గా హిట్స్ లేని నాగార్జున ఈ సారి ‘ది ఘోస్ట్’ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
అయితే ‘ది ఘోస్ట్’ సినిమా ప్లాప్ అయినా కానీ నాగార్జున హ్యాపీ గా ఉన్నాడు. కారణం ‘గాడ్ ఫాదర్’ సినిమా హిట్ అవ్వడం. గాడ్ ఫాద‌ర్ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా… నాగార్జున‌కు ఓ క‌థ చెప్పాడు. అది మ‌ల్టీస్టార‌ర్‌. ఇందులో నాగార్జున‌, అఖిల్ క‌లిసి న‌టిస్తున్నారు. అయితే నాగార్జున ఇంకా ఒకే చెప్పలేదు.
మోహన్ రాజా మీద ఇంకా నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ హిట్ అవ్వడంతో నాగార్జున మోహన్ రాజా కి గ్రీన్ సిగ్నల్ ఇచేలా ఉన్నాడు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ తో బిజీ గా వున్న నాగార్జున కొంత గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది.