Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు పూరి సినిమా అంటే తప్పనిసరిగా ఆ సినిమా హిట్ అనే టాక్ ఉండేది. ఇలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోలు అందరూ కూడా సినిమాలు చేసే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను వారి ఖాతాలో వేసుకున్నవారే.
ఇలా పూరి జగన్నాథ్ ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించినప్పటికీ ప్రస్తుతం మాత్రమే ఏ హీరో కూడా ఆయనకు డేట్స్ ఇవ్వటానికి ఆసక్తి చూపించడం లేదు. ఇక మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లు తిరిగి సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు చివరిగా బిజినెస్మెన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు అయితే ఈ ఇద్దరి కాంబోలో ఎందుకు సెట్ అవడం లేదనే ప్రశ్న కూడా అందరిలోనూ తలెత్తుతుంది. అయితే మహేష్ బాబు పూరితో సినిమా చేయకపోవడానికి గల కారణానికి గతంలో పూరి జగన్నాథ్ తెలియజేశారు. మహేష్ బాబు తనకు మధ్య సినిమా సెట్ అవ్వకపోవడానికి కారణం మహేష్ ఆటిట్యూడ్ అని పూరి తెలిపారు.
మహేష్ బాబు నాతో సినిమాలు చేయాలి అంటే నేను హిట్లు కొడుతుంటేనే నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు అలా కాదని నేను వరుస ఫ్లాప్ సినిమాలను కనుక ఎదుర్కొంటే ఆయన కూడా నాతో సినిమాలు చేయడానికి ఇష్టపడరు. కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం సినిమా చేయమని కోరుతారు అందుకే నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులు అంటేనే చాలా ఇష్టమని పూరి తెలిపారు.కనీసం వాళ్లు నన్ను ఎంతగానో నమ్ముతున్నందుకు.. మహేశ్ కు నాపై నమ్మకం లేకపోవడంతో కాంబో సెట్ అవ్వడం లేదు అంటూ మహేష్ బాబు ఆలోచన విధానం గురించి తనతో సినిమాలు చేయకపోవడం గురించి పూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.